Ghee Coffee: నెయ్యి కాఫీ ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా మారింది. ఒకప్పుడు టీ లేదా కాఫీ అంటే పెద్దవాళ్లకు మాత్రమే అనిపించేది. ఇప్పుడున్న జనరేషన్ లో ఉదయం లేచిన వెంటనే యువత టీ ని కోరుకుంటుంది.

Ghee Coffee: ఉదయాన్నే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా మారింది. ఒకప్పుడు టీ లేదా కాఫీ అంటే పెద్దవాళ్లకు మాత్రమే అనిపించేది. ఇప్పుడున్న జనరేషన్ లో ఉదయం లేచిన వెంటనే యువత టీ ని కోరుకుంటుంది. కప్పు టీ లేదా కాఫీ తగిన తరువాతనే ఇతర కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు.

ప్రస్తుతం టీ, కాఫీ లలో అనేక రకాలు పుట్టుకొస్తున్నాయి. ప్రాంతాన్ని బట్టి టీ, కాఫీలను తాగుతున్నారు. సాధారణ కప్పు కాఫీ కంటే నెయ్యి కాఫీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన పోషక విలువలను పెంచుతుంది. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ కాఫీని తాగుతూ పాపులర్ చేశారు. శీతాకాలంలో నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. శక్తి స్థాయిలను పెంచుతుంది
సాధారణ బ్లాక్ కాఫీతో పోలిస్తే నెయ్యి కాఫీ మీకు ఎక్కువ కాలం శక్తిని అందిస్తుంది. సాదా కాఫీని తాగినప్పుడు అప్పటికప్పుడే ఉపశమనం పొందుతారు. అయితే నెయ్యి జోడించడం ద్వారా ఆ ఫీల్ ఎక్కువసేపు ఉంటుంది. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కాఫీలో ఉండే కెఫిన్ స్థాయిని సమంగా ఉంచుతాయి.

2. ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది
ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం చాలా అవసరం. దేశీ నెయ్యి ఒమేగా-3, 6 మరియు 9 ఉత్తమ వనరులలో ఒకటి. ఇది గుండె ఆరోగ్యాన్ని, జీవక్రియను మరియు మెదడు పనితీరును మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది.

3. ప్రేగు మరియు జీర్ణక్రియకు మంచిది
చాలామంది ఉదయం కాఫీ తాగిన తర్వాత తరచుగా ఎసిడిటీని ఎదుర్కొంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కాఫీకి నెయ్యి జోడిస్తే ఉపశమనం లభిస్తుంది. ఖాళీ కడుపుతో నెయ్యి కాఫీని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు జీర్ణక్రియ ప్రక్రియను ఉత్తేజపరిచేందుకు మరియు మెరుగైన జీర్ణశయాంతర ఆరోగ్యానికి కూడా ప్రసిద్ధి చెందాయి.

4. వెచ్చగా ఉంచుతుంది
నెయ్యి కాఫీ సహజంగా లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పడిపోతున్నందున, అటువంటి ఆహారాలు మరియు పానీయాలు మిమ్మల్ని రక్షించగలవు.

నెయ్యి కాఫీని సిద్ధం చేయడానికి సాధారణ కాఫీని కాసేపు మరిగించి దానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జోడించండి. ఆ తర్వాత గిలకరించి నచ్చిన స్వీటెనర్‌ను ఎంచుకుని ఆస్వాదించండి.

Also Read: Hanuman 200 Crores : హనుమాన్ 200 కోట్లు.. కంటెంట్ ఉన్న సినిమా విధ్వంసం ఇది..!