మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో లవంగాలు కూడా ఒకటి. లవంగాలు కాస్త కారంగా, ఘాటుగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇవి కూరలకు రుచిని పెంచడంతో పాటు అనేక ప్రయోజనాలను కలిగిస్తాయట. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయట. కాగా ఈ లవంగాలను నీటిలో నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ ఉన్నాయి.
లవంగాలని నానబెట్టిన నీరు ఉదయాన్నే తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయట. యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ నీటిని తాగాలట. లవంగాల నీరు డైజెస్టివ్ సిస్టమ్ ని ప్రేరేపిస్తుందట. దీంతో మనం తీసుకున్న ఫుడ్ త్వరగా విచ్ఛిన్నమవుతుందని చెబుతున్నారు. దీంతో జీర్ణ సమస్యలు, బ్లోటింగ్, గ్యాస్, అజీర్ణం వంటివి దూరమవుతాయని,అలాగే గట్ హెల్త్ కూడా బాగుంటుందని చెబుతున్నారు. మనం తీసుకునే ఫుడ్, ఇతర కారణాల వల్ల చాలా మంది దంతక్షయం వంటి ఇతర సమస్యలు వస్తాయట. అలాంటప్పుడు ఈ లవంగాల నీరు ఆ సమస్యని తగ్గిస్తాయని చెబుతున్నారు. దీనికి కారణం ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలే అని చెబుతున్నారు.
లవంగాల నీటిని తాగడం వల్ల నోటి దుర్వాసన, దంతక్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు దూరమవుతాయట. అలాగే ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుందట. బరువు తగ్గాలి అనుకున్న వారు లవంగాల నీటిని తాగితే మెటబాలిజం పెరిగి బరువు త్వరగా తగ్గుతారట. ఇందులోని కాంపౌండ్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ని రెగ్యులేట్ చేస్తాయట. దీంతో పాటు క్రేవింగ్స్ లేకుండా చేస్తాయని చెబుతున్నారు. ఇమ్మ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్న లవంగాల నీటిని తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయట. రెగ్యులర్ గా తీసుకుంటే సీజనల్ గా వచ్చే సమస్యల్ని దూరం చేసుకోవచ్చట. అలాగే పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలా మంది ఊపిరితిత్తుల్లో చెత్త పేరుకుపోయి వాటి పనితీరు తగ్గుతుందట. కానీ మనం ఈ లవంగాల నీరు తాగితే ఊపిరితిత్తుల్లోని పేరుకుపోయిన చెత్త అంతా బయటికి వచ్చి శ్వాస సమస్యలు దూరమవుతాయట.