కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది కలబందను తింటూ ఉంటారు. కలబంద తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి అంటున్నారు. అయితే కలబంద రసం పరగడుపున తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలబందలో మన జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉంటాయట. అంతేకాదు ఈ జ్యూస్ లో చక్కెరలను, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే ఎంజైమ్ లు కూడా పుష్కలంగా ఉంటాయట. ఇవన్నీ అజీర్ణం సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని చెబుతున్నారు.
ఉదయాన్నే పరగడుపున కలబంద రసాన్ని తాగడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని, ఈ రసంలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందట. దీన్ని పరగడుపున తాగడం వల్ల మీ శరరీం హైడ్రేట్ గా ఉంటుందట. కలబంద రసంలో నిర్విషీకరణ లక్షణాలు కూడా ఉంటాయట. ఈ రసాన్ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ నుంచి విషాలు బయటకు పోయి మీ ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుందట. కలబంద రసంలో ఎన్నో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు.
కలబంద రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయట. ఇవి శరీరంలో వాపును తగ్గించడానికి బాగా సహాయపడతాయని, ఉదయం పరిగడుపున ఈ రసాన్ని తాగడం వల్ల వాపు, నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయట. కలబంద రసం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగు పరచడానికి కూడా బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతో పాటుగా డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని చెబుతున్నారు. కలబందని తరచుగా తీసుకోవడం వల్ల అందానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండవు అని చెబుతున్నారు.