Site icon HashtagU Telugu

Curd: పెరుగుతో పాటు ఈ పండ్లు కలిపి తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!

Eat Curd

Eat Curd

పాల ఉత్పత్తులలో ఒకటైన పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. కాగా పెరుగు జంతు ఉత్పత్తి కావడంతో పెరుగులో బ్యాక్టీరియా ఉంటుందట. అయితే పెరుగుని కొన్ని విధాలుగా మాత్రమే తీసుకోవాలట. లేదంటే ఇతర సమస్యలు వస్తాయట పెరుగులో ప్రోబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పేగు ఆరోగ్యానికి చాలా మంచిదట. కొంతమందికి పెరుగు తింటే అజీర్ణం వంటి సమస్యలు వస్తాయట. ఇది వారికి పడకపోవడం వల్ల కూడా అయి ఉంటుంది.

అదే విధంగా, పెరుగు తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదట. పెరుగుని ఎప్పుడు కూడా పరగడపున తినకూడదట. దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంతమంది పెరుగుని పాలతో కలిపి తీసుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు ఇలా తినడం వల్ల బ్లోటింగ్ సమస్య పెరిగే అవకాశం ఉందట. కాబట్టి, ఈ రెండింటిని వేర్వేరుగా తీసుకోవచ్చు కానీ, కలిపి అసలు తినకూడదని చెబుతున్నారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయట. పెరుగన్నంలో కచ్చితంగా ఉప్పు ఉంటేనే చాలా మంది తింటారు. కొంతమందేమో పెరుగులో చక్కెర వేసుకుని తింటారు. పెరుగన్నం అంటే ఉప్పు ఉండాల్సిందే.

ఉప్పు, పంచదార రెండు కూడా ప్రాసెస్ చేస్తారు. దీని వల్ల పెరుగులోని ప్రోబయోటిక్స్, ఇతర పోషకాలు నాశనమవుతాయట. అంతలా కావాలనుకుంటే రాళ్ల ఉప్పు ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. తీపి కావాలనుకుంటే పటిక బెల్లం కలిపి వాడడం మంచిదట. దీని వల్ల జరిగే నష్టాన్ని కాస్తా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. సీజన్‌ని బట్టి పెరుగులో ఆయా సీజన్‌లో దొరికే పండ్లని కలిపి తినడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా, పెరుగులో అరటిపండు, లేదా మామిడిపండు ఇలా కలిపి తినడం అలవాటు. అలా తినకూడదట. పెరుగులో కూలింగ్ గుణాలు ఉంటాయి. ఇక మామిడిపండ్ల లోని వేడి చేసే తత్వం రెండు కలిసి కడుపులో గందరగోళాన్ని ఏర్పరుస్తాయట. విడివిడిగా తినడం మంచిది. పుల్లగా ఉండే పండ్లతోని కూడా కలిపి తినొద్దు. దీని వల్ల బ్లోటింగ్, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయిట. వీటితో పాటు దోసకాయతో కలిపి తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు, జ్వరం, స్కిన్ ప్రాబ్లమ్స్‌ కి కారణమవుతాయట. చాలా మంది రైతాని ఇష్టంగా తింటారు. ఇందులో దోసకాయ, ఉల్లిపాయలు వేస్తారు. కానీ, ఇది కూడా అస్సలు మంచిది కాదట.