Site icon HashtagU Telugu

Cucumber : హైడ్రేషన్ ను పెంచి.. అందాన్నిచ్చే దోసకాయలు.. ఎండాకాలంలో మరిన్ని ఉపయోగాలు

Benefits of Cucumber in summer Must Eat Cucumber for Health

Benefits of Cucumber in summer Must Eat Cucumber for Health

ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడి తాపాన్ని తట్టుకోవాలంటే తరచూ మజ్జిగ(Butter Milk), మంచినీరు(Water), నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయల్లో ముందుండేవి దోసకాయలు. తీగలా పాకుతూ పండే కూరగాయల్లో ఇవీ ఒకటి. దోసకాయలు(Cucumber), కీరా దోసకాయలు పచ్చిగా కూడా తినవచ్చు. దోసకాయలతో మనం పప్పు, కూర, సాంబార్, పచ్చడి.. ఇలా రకరకాలు చేసుకుంటామని తెలిసిందే.

దోసకాయల్లో ఎన్నో పోషక ప్రయోజనాలుంటాయని చాలామందికి తెలీదు. వీటిలో అధిక స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి ఇందులో లభిస్తుంది. రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.

దోసకాయల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది.

దోసకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహించి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

వీటిలో 95 శాతం నీరు ఉంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు దోహదపడుతాయి. బరువు తగ్గేందుకు వీటిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణుల సూచన.

దోసకాయల్లో కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనాలుంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటంతో ఇవి శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో దోసకాయలను ప్రధానంగా వాడుతారు. వీటిలో ఉన్న విటమిన్ సి, కెఫిక్ యాసిడ్ చర్మం మంటను తగ్గిస్తాయి.

బ్యూటీపార్లర్లు, స్పాలలో కళ్లపై కీర దోస ముక్కలను ఉంచుతారు. ఎందుకంటే ఇవి కంటి అలసటను తగ్గిస్తాయి. అలాగే కళ్ల చుట్టూ ఉబ్బిన ప్రాంతాలను తగ్గిస్తాయి. చర్మంపై ముడతలు, గీతలను తగ్గించి కాంతి వంతంగా ఉంచుతాయి.

దోసకాయల్లో ఉండే సిలికా జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన ఖనిజం. ఇది జుల్లును దృఢంగా, మెరిసేలా చేస్తుంది.

 

Also Read :  Milk-Dry grapes Benefits: పాలు ఎండు ద్రాక్ష కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?