Site icon HashtagU Telugu

Gingelly Oil : నువ్వులనూనెతో కూడా వంటలు చేసుకోవచ్చు.. దాని వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు మీకు తెలుసా ?

Benefits of Cooking food with Gingelly Oil

Benefits of Cooking food with Gingelly Oil

మనం రోజూ తినే ఆహారంలో శనగనూనె, సన్ ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ ఇలా రకరకాల నూనెలను వాడుతుంటాం. కానీ.. చాలా ఏళ్లుగా నువ్వులనూనె(Gingelly Oil) కూడా మన ఆహారంలో ఒక భాగం. ఇప్పటి జనరేషన్ ఈ ఆయిల్ తో చేసే వంటకాలను ఇష్టపడరు కానీ దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇప్పుడు ఈ నూనెను దీపారాధనకు, శరీరానికి రాయడానికి వాడుతున్నారు. అయితే నువ్వుల నుంచి వచ్చే నూనెను ప్రాసెస్ చేసి వంటలకు వాడేది, దీపారాధనకు వాడేది సపరేట్ గా తయారు చేస్తారు.

అయితే తినే ఆహారంలో నువ్వులనూనెను అన్ని సీజన్లలో ఉపయోగించకూడదు. వర్షాకాలం ముగిసి శీతాకాలం మొదలయ్యేనాటికి వాతావరణంతో పాటు మన శరీరంలోనూ మార్పులొస్తాయి. శీతాకాలంలో చలిని తట్టుకునేందుకు ఆహారంలో నువ్వుల నూనెను తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ నువ్వులనూనెను ఆహారంలో తీసుకోవచ్చు. ఆ సమయంలోనే నువ్వుల నూనె ఎక్కువగా దొరుకుతుంది. అప్పుడే కార్తీకమాసం, పూజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నువ్వుల నూనెను విరివిగా వాడతారు. ఫిబ్రవరి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి ఆ సమయంలో ఈ నూనెను ఆహారంలో తీసుకోరాదు. నువ్వుల నూనె శరీరాన్ని ఉష్ణంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఫలితంగా చలి నుంచి కాపాడుతుంది.

ఒక టీస్పూన్ నువ్వులనూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండవు. నువ్వులనూనెలో ఉండే విటమిన్ ఈ.. యూవీకిరణాలు, కాలుష్యం, టాక్సిన్స్ నుంచి చర్మకణాలను రక్షిస్తుంది. నువ్వుల నూనెలో ఉండే ఫైబర్ శరీరంలోని ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసేందుకు తోడ్పడుతుంది. ఫలితంగా మలబద్ధకం తగ్గుతుంది. నువ్వులనూనెలో విటమిన్లు డి, ఈ, కె ఉంటాయి. ఇది వాత, కఫాలను నియంత్రిస్తుంది. కాబట్టి ఈ సారి నువ్వుల నూనెతో వంటలు చేయడానికి ట్రై చేయండి. ఇప్పటికి కొంతమంది పచ్చళ్ళు నువ్వుల నూనెతోనే పెడతారు. అయితే ఇప్పుడు బయట డూప్లికేట్ నువ్వుల నూనెలు, నాసిరకంవి ఎక్కువగా దొరుకుతున్నాయి. కాబట్టి మంచిది చూసి కొనుక్కోండి.