Benefits of Cloves : లవంగం తింటే ఎన్ని లాభాలో తెలిస్తే..అస్సలు వదిలిపెట్టారు.ముఖ్యంగా మగవారు

లవంగాలలో ఉండే పోషకాలు తెలిస్తే లవంగాలను అస్సలు వదిలిపెట్టారు. లవంగంలో కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 11:48 AM IST

లవంగము (Cloves)..అనగానే ఆ ఏముంది ఇంట్లో వంట చేసేటప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ (Non Veg) కూరలలో, బిర్యానీ (Biryani) లలో ఎక్కువగా ఉపయోగిస్తాం. అంతే కదా..అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు లవంగాలలో ఉండే పోషకాలు తెలిస్తే లవంగాలను అస్సలు వదిలిపెట్టారు. లవంగంలో కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు ఉంటాయి.

ఈ లవంగం (Cloves) మెడిసిన్ కంటే ఎక్కువగా పనిచేస్తుంది..ఎలాగో తెలుసా..?

చాలామందికి దగ్గు అనేది ఇబ్బంది పెడుతుంటుంది. దగ్గు ఎక్కువగా ఉన్నపుడు .. టీలో శొంఠికి బదులు లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేయించి పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణము అవుతుంది. మూడు లీటర్ల వాటర్ లో నాలుగు గ్రాముల లవంగాలు వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించి తాగితే కలరా విరేచనాలుతట్టుతాయి. ఆరు లవంగాలు కప్పు నీళ్లు కలిపి డికాక్షన్ తయారుచేసి ..చెంచాకు కొంచం తేనే కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ” ఉబ్బసము ” తగ్గుతుంది.

పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది, వంటకాలలో దీనిని ఉపయోగించడం వల్ల చర్మ కాన్సర్ ను తగ్గించవచ్చును, దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరములో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక గుండెల్లో మంటగా అనిపించినా… పంటినొప్పి బాధపెట్టిన… జలుబుతో ఇబ్బంది పడుతున్న లవంగాలు..అద్భుత ఔషధ సుగంధద్రవ్యాలు. మొటిమలు, రాష్‌లు, దద్దుర్లు… వంటి చర్మ సమస్యలకూ లవంగనూనె బాగా ఉపయోగపడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

భోజనం (Food) తర్వాత లవంగాలను తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు :

రోజూ మూడు పూటలా భోజనం తరువాత లవంగాలను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భోజనం చేసిన తరువాత లవంగాన్ని తింటే జీర్ణ వ్యవస్థ సరిగా పని చేస్తుందని, పేగులు శుభ్రపడతాయి. కడుపులో సూక్ష్మజీవుల నుండి, వివిధ రకాల హాని కలిగించే క్రిముల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి లవంగం శరీరాన్ని కాపాడుతుంది.

మగవారు (Men) లవంగాలు తింటే స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది..

లవంగం అన్ని వయసుల వారికి మంచిదే అయినప్పటికీ.. మగవారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి, వారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో లవంగాలు సహయపడతాయి. పురుషులు వారి ఆహారంలో లవంగాలు చేర్చుకుంటే మరిన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

లైఫ్‌స్టైల్‌లో మార్పులు, ధూమపానం, చెడు ఆహారపు అలవాట్లు, మద్యపానం, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అనేక సమస్యల కారణంగా.. పురుషులలో సంతానోత్పత్తి సమార్థంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుంది. పురుషుల సంతానోత్పత్తి సమార్థ్యం పెంచడానికి ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. లవంగాల్లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్‌ చేసి రిప్రొడెక్టివ్‌ అవయవాలకు.. నష్టం జరగకుండా చూసుకుంటాయని ఓ అధ్యయనం వ్యక్తం చేసింది. మగవారు లవంగాలు తింటే స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది, స్పెర్మ్‌ నాణ్యత, మూవబిలిటీని మెరుగుపడుతుంది. అలాగే లవంగాల తింటే ..బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

లవంగాలు (Cloves ) అతిగా తీసుకున్న ఇబ్బందే :

చెప్పారు కదా అని లవంగాలు ఎక్కువగా కూడా తీసుకోవద్దు. లవంగాలు మంచి చేస్తాయని చాలా మంది ఎప్పుడూ నోట్లో లవంగాలను ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటికీ అలా నోట్లో లవంగాలు ఉంచుకోవటం మంచిది కాదు. లవంగాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదేపనిగా లవంగాలను తింటే, కొత్తరకం ఆరోగ్య సమస్యలు వచ్చే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రోజుకు ఒకటి రెండు లవంగాలను తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదని, మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

Read Also : టీ కాంగ్రెస్ లో మొదలైన అసమ్మతి సెగలు..విష్ణువర్ధన్ రాజీనామా ..?