కరివేపాకు వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు కరివేపాకుని ఇష్టంగా తింటే మరికొందరు మాత్రం తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కూరలో కరివేపాకే కదా అని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కరివేపాకుతో వంటలు వండటం వల్ల రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆకులని నమ్మడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయట. కరివేపాకులో విటమిన్, ఎ, బి, సి, ఈలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ లినాలూల్, ఆల్ఫా టెర్పినేన్, మైర్సీన్, మహానీంబైన్, క్యారియోఫిలీన్ తో పాటు మరికొన్ని గుణాలు ఉన్నాయి.
ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రోజూ ఉదయాన్నే నాలుగు నమిలి తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయట. జీర్ణ సమస్యలతో బాధపడేవారు కరివేపాకు ఆకులను నమిలి తినడం వల్ల ఈ సమస్యల దూరమవుతాయట. మలబద్ధకంతో బాధపడేవారికి ఇందులోని గుణాలు ఆ సమస్యని దూరం చేస్తాయట. దీంతో అధిక బరువు వంటి సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. కరివేపాకు మన బాడీని డీటాక్స్ చేసినట్టుగానే మన లివర్ ని కూడా కాపాడుతుందట. ఇందులోని గొప్ప గుణాలు లివర్‌ని డీటాక్సీ ఫై చేసి కాలేయాన్ని కాపాడతాయట.
అదే విధంగా కరివేపాకులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బాడీ ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గిస్తుందని, దీని వల్ల మంట, వాపు వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఉదయాన్నే పరగడపున కరివేపాకు నమిలి తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ రెగ్యులేట్ అవుతాయట. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు కంట్రోల్ అవుతాయని చెబుతున్నారు. కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. బీటా కెరోటిన్ వంటి ప్రోటీన్స్ జుట్టు సమస్యల్ని దూరం చేస్తాయి. హెయిర్ ఫోలికల్స్‌ని బలంగా చేస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మార్చి ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. అయితే ఉదయాన్నే కొన్ని కరివేపాకులు తీసుకుని శుభ్రం చేసుకుని ఖాళీ కడుపుతో తినాలి. ఇలా తినడానికి ఇష్టపడని వారు కూరల్లో వేసుకుని కూడా తినవచ్చు అని చెబుతున్నారు.