Site icon HashtagU Telugu

Cauliflower : చలికాలంలో ఎక్కువగా దొరికే క్యాలీ ఫ్లవర్.. తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Benefits of Cauliflower in Winter Must Eat

Benefits of Cauliflower in Winter Must Eat

క్యాలీ ఫ్లవర్(Cauliflower) మనకు చలికాలంలో(Winter) ఎక్కువగా దొరుకుతుంది. ఫ్లవర్ అని పిలిచినా పువ్వులా కనపడే కూరగాయ. క్యాలీఫ్లవర్ తో పప్పు, పచ్చడి, కూర, ఫ్రై చేసుకుంటాం. సాంబార్ లో కూడా వేసుకుంటారు. క్యాలీ ఫ్లవర్ లో విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్.. లాంటివి మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. చలికాలంలోనే ఎక్కువగా దొరికే క్యాలీఫ్లవర్ ఈ కాలంలో ఎక్కువగానే తినాలి. క్యాలీఫ్లవర్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి.

* క్యాలీ ఫ్లవర్ ను తినడం వలన అది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది.
* క్యాలీ ఫ్లవర్ ని తినడం వలన అది మన చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది.
* క్యాలీ ఫ్లవర్ ని తినడం వలన అది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
* క్యాలీ ఫ్లవర్ ని తినడం వలన అది మన ఎముకల బలాన్ని పెంచుతుంది.
* క్యాలీ ఫ్లవర్ లో ఉండే ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు మంచిది.
* జుట్టు ఊడిపోవడం, జుట్టు తెల్లబడడం వంటి వాటిని క్యాలీ ఫ్లవర్ తగ్గిస్తుంది.
* క్యాలీ ఫ్లవర్ ను తినడం వలన అది మన మెదడుని చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
* క్యాలీ ఫ్లవర్ ను తినడం వలన అది మన శరీరంలో ఉండే రక్తపోటును, మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది.
* నరాల సమస్యను, అల్జీమర్స్ ను తగ్గించడానికి క్యాలీఫ్లవర్ ఉపయోగపడుతుంది.
* రొమ్ము క్యాన్సర్ ను నివారించడానికి కూడా క్యాలీఫ్లవర్ ఉపయోగపడుతుంది.