భారతీయుల వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. ఈ యాలకులను కూరల్లో మాత్రమే కాకుండా స్వీట్లు తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రుచి నుంచి పెంచడంతోపాటు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. యాలకుల్లో విటమిన్ బి6, విటమిన్ బి3, విటమిన్ సి, జింక్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట. అయితే చాలా మంది యాలకులను టేస్ట్ కోసం, మంచి సువాసన కోసం టీలో వేస్తుంటారు. కానీ మరికొందరు అలా చేసుకోవడానికి ఇష్టపడరు.
మరి టీ లో యాలకులు వేసుకొని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యాలకులు వేసిన టీని రెగ్యులర్ గా తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయట. ఎసిడిటీతో బాధపడేవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. యాలకులు వేసిన టీని తాగితే ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయమవుతాయట. ఈ టీ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుందట. అందుకే అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు యాలకులు కలిపి టీని రెగ్యులర్ గా తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
అలాగే ఈ టీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుందట. ఈ టీని ప్రతిరోజూ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయట. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు యాలకులు వేసిన టీని రోజూ తాగడం మంచిదని చెబుతున్నారు. యాలకులు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయట. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. యాలకుల టీని తాగితే దగ్గు, జలుబు సమస్యలు తగ్గిపోతాయట. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా నయమవుతుందని చెబుతున్నారు. యాలకులు వేసిన టీ బెల్లీ ఫ్యాట్ రాకుండా చేయడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. ఎలా అంటే ఈ టీ మీ శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా చేయానికి జీవక్రియను పెంచుతుంది. అలాగే ఈ టీ తాగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందట.