Site icon HashtagU Telugu

Black Sesame Seeds: నల్ల నువ్వుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

Black Sesame Seeds

Black Sesame Seeds

మార్కెట్లో మనకు మామూలుగా రెండు రకాల నువ్వులు లభిస్తూ ఉంటాయి. ఇందులో ఒకటి నల్ల నువ్వులు అయితే రెండవది తెల్ల నువ్వులు. వీటిని ఉపయోగించి కొన్ని రకాల స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం నల్ల నువ్వులను కాకుండా తెల్ల నువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే తెల్ల నువ్వులతో పోల్చుకుంటే నల్ల నువ్వుల వల్లే ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి నల్ల నువ్వుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నల్ల నువ్వులు నిగెల్లా సాటివా మొక్కకు కాస్తాయి. ఈ నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల నువ్వులు శక్తివంతమైన రోగనిరోధక మాడ్యులేటర్ కూడా. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందట. నల్ల నువ్వులను ఎన్నో రకాల నాన్, మఫిన్లు, కేకులు, గింజలు మొదలైన వాటిపై చల్లి డెకరేట్ చేస్తారు. తలనొప్పి, పంటి నొప్పి, ఉబ్బసం, ఆర్థరైటిస్, కండ్లకలక వంటి అన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. నల్ల నువ్వులు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడుతుందట.

దగ్గు, గొంతునొప్పి, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్నవారు నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల మంచి లాభాలను పొందవచ్చని చదువుతున్నారు. ఇది శ్లేష్మాన్ని తగ్గిస్తుందట. అలాగే మంటను తగ్గించి అలెర్జీని కూడా నివారిస్తుందట. సైనసైటిస్ సమస్యను తగ్గించుకోవడానికి కూడా నల్ల నువ్వులు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. నల్ల నువ్వులు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాట. వీటిని తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయట. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి.

నల్ల నువ్వుల్లో లినోలెయిక్ ఆమ్లం, ఒలేయిక్ ఆమ్లం వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయని, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయట. నల్ల నువ్వులు అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయట. అందుకే వీటిని హైబీపీ ఉన్నవారు తినాలని చెబుతున్నారు. నల్ల నువ్వుల నూనెతో రొమ్ములను మసాజ్ చేయడం వల్ల రొమ్ములో నొప్పి తగ్గుతుందట. అలాగే నల్ల నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తాయట. అలాగే సన్న బడటాన్ని కూడా తగ్గిస్తాయట. అలాగే ఇవి సోరియాసిస్, తామర లక్షణాలను మెరుగుపరుస్తాయని, ఫంక్షనల్ డిస్స్పెప్సియా వంటి సమస్యలు ఉన్నవారు నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్, పెద్దప్రేగు శోథ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

Exit mobile version