Site icon HashtagU Telugu

Black Jamun : అల్లనేరేడు పండ్లు తినండి.. ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

Jamun

Jamun

అల్లనేరేడు(Black Jamun) పండును ఇండియన్ బ్లాక్ బెర్రీ, బ్లాక్ ప్లమ్.. ఇలా అనేక పేర్లతో పిలుస్తాం. ఇంకా ఆరోగ్యఫలప్రదాయని అని పిలుస్తారు. ఎందుకంటే అల్లనేరేడు పండులో అన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. ఇక ఈ వర్షాకాలంలో నేరేడు పండ్లు బాగా దొరుకుతాయి. వంద గ్రాముల అల్లనేరేడు పండ్లలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ ఎన్నో ఉండటంతో అవి పండ్లను తినడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

* అల్లనేరేడు పండ్లలో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుంది.
* అల్లనేరేడు పండ్లలో తక్కువ గ్లైకోసెమిక్ ఉండడం వలన దీనిని డయాబెటిక్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఇది తినడం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
* అల్లనేరేడు పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు మన నోటిలో ఉండే దుర్వాసన పోతుంది. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
* కిడ్నీలు, లంగ్స్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది.
* అల్లనేరేడు పండ్లలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
* అల్లనేరేడు పండ్లలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మెదడు ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండేలా చేస్తుంది.
* అల్లనేరేడు పండ్లలో ఉండే కాల్షియం, ఐరన్, పొటాషియం మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఇంకా మన ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తాయి.
* ఈ నేరేడు పండ్లలో ఉండే విటమిన్ ఎ మన కంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి.
* నేరేడు పండ్లు తినడం వలన మనకు చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి.
* ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు నేరేడు పండ్లను తినడం వలన రోగనిరోధకశక్తి పెరిగి మనకు ఆ సమస్యలు రావడం తగ్గుతాయి.

 

Also Read : Chrysanthemum: అందం రెట్టింపు కావాలంటే చామంతితో ఇలా చేయాల్సిందే ?