Site icon HashtagU Telugu

Barley: చలికాలంలో బార్లీ నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా!

Barley

Barley

మనందరికీ బార్లీ గింజల గురించి తెలిసే ఉంటుంది. వీటిని ఎక్కువగా వేసవికాలంలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి హైబీపీ డయాబెటిస్ గుండె సమస్యలు ఉన్న వారికి ఎంతో బాగా పనిచేస్తాయి. బార్లీ నీటిలో విటమిన్స్, మినరల్స్, ఫొలేట్, ఐరన్, కాపర్, మంగనీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని నేరుగా తాగడం ఇష్టం లేకపోతే ఇందులో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్చు. ఈ నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బార్లీ నీటిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫికేషన్ జరుగుతుంది. దీని వల్ల ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ మెరుగ్గా మారుతుంది.

ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. బాడీలోని వ్యాధికారక క్రిములన్నీ బయటికి వెళ్లిపోతాయని చెబుతున్నారు. బార్లీ నీటిలో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు దూరమవ్వడమే కాకుండా బౌల్ మూమెంట్స్ బాగుంటాయట. ఈ నీటిని తీసుకోవడం వల్ల గట్ హెల్దీ బ్యాక్టీరియాని పెంచుతుందని, దీంతో జీర్ణ సమస్యలు దూరమవ్వడమే కాకుండా మెటబాలిజం పెరుగుతుందని చెబుతున్నారు. బార్లీ వాటర్‌‌ని తీసుకుంటే మంచి బ్యాక్టీరియాని పెంచి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తాయట. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ సరిగ్గా ఉంటాయట. అన్‌స్వీటెన్డ్ అయిన ఈ నీటిని తీసుకోవడం వల్ల ఒకేసారి బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగవు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ షుగర్ ఉన్నవారికి సమస్యలు లేకుండా చేస్తాయని చెబుతున్నారు. బార్లీ నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో కొలెస్ట్రాల్‌ని కరిగిస్తాయి. దీంతో పాటు ఆర్టరీ బ్లాకేజ్‌ని క్లియర్ చేస్తాయట. రెగ్యులర్‌ గా తాగితే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట.

అదే విధంగా, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయట. ఈ బార్లీ నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో బ్లాకేజీని క్లియర్ చేసి రక్త సరఫరాని మెరుగ్గా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఈ బార్లీ నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ముప్పావు కప్పు బార్లీ గింజలు,రెండు నిమ్మకాయలు, అర కప్పు తేనె,ఆరు కప్పుల నీరు తీసుకోవాలి. ముందుగా బార్లీని శుభ్రంగా కడిగి, తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో బార్లీ వేసి నిమ్మ చెక్కలు ఒక రకంగా చెప్పాలంటే రసం పిండి ఆ తొక్కలు తీసుకోండి. అందులోనే 6 కప్పుల నీరు వేయాలి. మీడియం మంటపై వేడి చేయాలి. వేడి అయిన తర్వాత 15 నుంచి 30 నిమిషాల వరకూ సిమ్‌ లో పెట్టి మరిగించాలి. ఇప్పుడు ఆ నీటిని మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాక అందులో కొద్దిగా తేనె వేసి కలిపి తాగాలి.