మామూలుగా స్త్రీలు ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఎన్నెన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో నెయ్యి కూడా ఒకటి. కొంతమంది నెయ్యితో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ అప్లై చేస్తూ ఉంటారు. నిపుణులు కూడా నెయ్యితో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి అందుకోసం నెయ్యితో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ చిట్లిపోతాయట. దీంతో మీ చర్మం సహజంగా మెరుస్తుందట. అక్కడక్కడ నలుపు దనం కూడా పోతుందట.
నెయ్యి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. కాగా ముఖానికి నెయ్యిని అప్లై చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుందట. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందట. ఇది మీ ముఖాన్ని గ్లో చేస్తుందని చెబుతున్నారు. దేశీ నెయ్యిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం అందంగా మెరిసిపోతుందట. ఇది కెమికల్స్ ప్రొడక్ట్స్ మాదిరిగా ముఖ చర్మానికి ఎలాంటి హాని కలిగించదట. అలాగే దీనివల్ల ఎలాంటి కొత్త చర్మ సమస్యలు కూడా రావు అని చెబుతున్నారు. అలాగే ముఖ చర్మాన్ని మృదువుగా మార్చడానికి నెయ్యి ఎంతగానో సహాయపడుతుందట.
నెయ్యిని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారే సమస్య పూర్తిగా పోతుందట. అంతేకాదు ఇది ముఖంపై ఉండే మచ్చలను సైతం పోగొడుతుందని చెబుతున్నారు. అయితే ముఖానికి నెయ్యిని అప్లై చేసే ముందు గోరువెచ్చగా చేయాలట. అందులో చిటికెడు కుంకుమపువ్వు వేసి కలపాలట. నెయ్యి కలిపిన తర్వాత నాలుగు చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేయాలని తేలికపాటి చేతులతో ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలని చెబుతున్నారు. అయితే ఈ మిశ్రమాన్ని రాత్రి పూట అప్లై చేసుకోవడం మంచిదని చర్మం ఆరోగ్యంగా అందంగా మారుతుందని చెబుతున్నారు.