కలబంద వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూర్వం నుంచే కలబందను ఎన్నో రకాల ఔషదాల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. కలబంద కేవలం ఆరోగ్యానికి మాత్రమే అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కలబందను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధకశక్తిని పెంచడం, షుగర్‌ను కంట్రోల్లో ఉంచడం, మొటిమలు నయం చేసే మల్టీటాస్కర్‌గా కలబంద పనిచేస్తుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
కలబంద జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా మెరుగవుతుంది. దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. కలబందలో ఉన్న లక్షణాలు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సాయపడతాయి. కాలేయ ఆరోగ్యానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది. కలబంద వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. కాలిన వెంటనే కాలిన ప్రదేశంలో కలబంద అప్లై చేయడం వల్ల మంట తగ్గిపోతుంది. బొబ్బలు రావు. అలాగే తొందరగా చర్మం మాములు రంగులోకి వస్తుంది.
కలబంద రసంలో కాస్త పసుపు కలిపి లేక కలపకుండా చర్మం మీద రాస్తే నల్ల మచ్చలు పోతాయి. పొడి చర్మం కలవారికి ఇది చాలా మంది మాయిశ్చరైజింగ్ గా పని చేస్తుంది. కాళ్లలో వచ్చే పగుళ్లను పోగొడుతుంది. ఈ ముద్దను రెండు మూడు గ్రాములు లోపలికి తీసుకుంటే ముట్టునొప్పి తగ్గుతుంది. ఋతు సంబందమైన వ్యాధులలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. లివర్ వ్యాధులలో దీని రసం గోరు వెచ్చని నీళ్లలో కలిపి ఇవ్వవచ్చు. నిత్యం మలబద్దకంతో బాధపడేవారు కూడా రోజు మార్చి రోజు తీసుకోవచ్చట. అధిక ఊబకాయంతో బాధపడేవారికి ఇది మంచిగా పని చేస్తుంది. నెలల తరబడి వాడినా దీని వలన నష్టం లేదు.