Site icon HashtagU Telugu

Ajwain Water: వాము నీరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Ajwain Water

Ajwain Water

భారతీయ వంటకాలలో ఉపయోగించే వాటిలో వాము కూడా ఒకటి. ఈ వాము వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వామును తరచుగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అనేక రకాల వంటలు తయారీలో కూడా ఈ వామును ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడైనా కడుపు నొప్పించినప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వాము వాటర్ తాగుతూ ఉంటారు. ఇది కడుపునొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఇకపోతే ఈ వాము నీళ్ల వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నీటిలో నానబెట్టిన వాము గింజలు తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైముల విడుదలను ప్రేరేమించడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అజీర్ణం, ఉబ్బరం మలబద్ధకం వంటి లక్షణాలను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందట. ఈ వాము చూడటానికి జీలకర్ర మాదిరిగా ఉంటుంది. ఈ వామును గుండెల్లో మంట తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ వాము నీరు తాగడం వల్ల కడుపులో ఆమ్లస్థాయిలను తగ్గించడంలో అది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. క్యారమ్ సీడ్ వాటర్ ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ పరిస్థితులతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మంటను తగ్గించడంలో , సులభంగా శ్వాసను ప్రోత్సహించడంలో సహాయపడవచ్చని చెబుతున్నారు.

క్యారమ్ సీడ్ వాటర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా జీవక్రియను పెంచుతుంది. ఇది పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుందట. ఇది మెరుగైన జీవక్రియ రేటు, పెరిగిన శక్తి స్థాయిలకు దారితీస్తుందని చెబుతున్నారు. అయితే బహిష్టు సమయంలో నీళ్లలో నానబెట్టిన వాము గింజలను తీసుకోవడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చట. విత్తనాలు యాంటి స్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కండరాలను సడలించడం,నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఈ క్యారమ్ గింజలలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు , యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చట. క్రమం తప్పకుండా క్యారమ్ సీడ్ వాటర్ తాగడం వల్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి శరీరం రక్షణ యంత్రాంగాన్ని పెంచుతుందని చెబుతున్నారు. ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయట. అలాగే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు..

Exit mobile version