Site icon HashtagU Telugu

Face Roller: ముఖానికి ఫేస్ రోలర్ ప్రయోజనాలు .. ఎలా వాడాలి అంటే..

Face Roller

Face Roller

Face Roller: అందం గురించి శ్రద్ద తీసుకోవడంలో యువత ముందంజలో ఉంది. ఉన్న ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా ఎన్నో రకాల కాస్మొటిక్స్ ప్రొడక్ట్స్ ని వాడుతున్నారు. ఈ మధ్య పేస్ రోలర్ పేరు బాగా ప్రాచుర్యం పొందుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పేస్ రోలర్ వాడకంపై ఇంట్రెస్ట్ చూపింస్తుండటంతో యువత కూడా వాళ్ళని ఫాలో అవుతుంది. పేస్ రోలర్ ని తరచూ వాడడం వల్లే ఫలితాలు కనిపిస్తాయి. శాశ్వత ప్రభావం కలగదు. రోలర్ ఉపయోగించే ముందు మంచి ఫలితాల కోసం శుభ్రమైన ముఖానికి మాయిశ్చరైజర్ లాంటిది రాసుకుంటే మంచిది. దీనివల్ల రోలర్ చర్మంలోపలికి మాయిశ్చరైజర్ చొచ్చుకుపోయేలా చేస్తుంది. అంతేకాదు ముఖంపై రోలర్ సులభంగా కదలగలుగుతుంది.

ముఖంపై మొటిమలు మరియు ముడతలతో విసిగిపోయి ఉంటే పేస్ రోలర్ ఉపశమనం ఇస్తుందని చెప్తున్నారు. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలో మరియు చర్మంపై దాని ప్రయోజనాలను తెలుసుకుందాం. ఇది మంచి ఫేస్ మసాజ్ కోసం వాడుతుంటారు. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. మీ చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని కారణంగా ముఖంపై మచ్చలు మరియు మొటిమల సమస్యలను వదిలించుకోవచ్చు. ఇది ఒక సౌందర్య సాధనం. చర్మం, మెడ మొదలైన వాటికి మసాజ్ చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. దీని వాడకంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఫైన్ లైన్స్ లేదా మొటిమల సమస్య ఏదైనా కావచ్చు ఇది అన్ని రకాల చర్మ ప్రయోజనాలను అందిస్తుంది. అన్ని రకాల చర్మానికి దీన్ని సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.

ఫేస్ రోలర్ ఎలా ఉపయోగించాలి?
– దీనిని ఉపయోగించే ముందు పేస్ రోలర్ ని చల్లటి నీటిలో లేదా ఫ్రీజ్ లో కొంత సమయం పాటు ఉంచాలి.

– ఏదైనా ఫేషియల్ ఆయిల్, క్రీమ్ ముఖానికి రాసి, మెడ నుండి పైకి రోలర్‌తో మసాజ్ చేయండి.

– ముఖంపై పైకి ఉపయోగించడం వల్ల ముడతలు తొలగిపోతాయి .

– నుదిటిపై చక్కటి గీతల కోసం ప్రతిరోజూ 5 నిమిషాల పాటు నుదుటిపై రోలింగ్ చేయండి.

– కళ్ళకు ఉపయోగించాలనుకుంటే చిన్న రోలర్ తీసుకోండి.

ఫేస్ రోలర్ ప్రయోజనాలు
– ముఖంలోని ఉబ్బరాన్ని తొలగిస్తుంది.

– రక్తనాళాల్లో రక్త ప్రసరణను పెంచుతుంది.

– చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

– ఇది సైనస్‌లో కూడా సహాయపడుతుంది.

– చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

– కండరాలకు విశ్రాంతినిస్తుంది.

Also Read: MLC Kavitha: కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకం: కల్వకుంట్ల కవిత