చాలామందికి కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్ కలిపి తీసుకోవడం అలవాటు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు మంచి జరిగితే మరి కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చని చెబుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది ఇష్టపడే కాంబినేషన్ లో పాలుతీయని,తేనె కూడా ఒకటి. ఈ కాంబినేషన్ ను కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు తేనెను ఇష్టపడని వారు ఉండరు. తేనె తియ్యగా కమ్మగా రుచిగా ఉంటుంది. పాలు, తేనె కలుపుకొని తాగితే రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
అలాగే పాలల్లో క్యాల్షియంతో పాటు ప్రొటీన్లు కూడా ఉంటాయట. ప్రతీరోజు నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో రెండు టీ స్పూన్ల తేనె కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య తగ్గడం మాత్రమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందట. పాలు, తేనె కలుపుకొని తాగడం వల్ల లాభాలే కాదు ఆరోగ్యానికి నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు. పాలు తేనె కలుపుకొని తాగితే కలిగే ఆరోగ్యప్రయోజనాలు. పాలల్లో ముఖ్యంగా వైటమిన్ డి, వైటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఇతర పోషకాలు కూడా ఉంటాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు సంమృద్ధిగా వుంటాయ్.
రెండింటిలో పోషకాలు, వైటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా వుండడంతో ఈ రెండూ కలుపుకొని తాగితే శరీరానికి సంజీవని పానియం లాంటిదని అనుకోవచ్చు. అటు పాలు ఇటు తేనె రెండింటిలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉన్నాయి. పాలలో ఉండే ఇమ్యునోగ్లోబిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండే పోషకాలు ఉంటాయి. ఈ రెండూ కలుపుకొని తాగడం వల్ల కరోనా లాంటి భయంకరమైన రోగాల నుంచి కూడా కొంత వరకు బయటపడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. తేనెలో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి. ఇక పాలు సులభంగా జీర్ణమవుతాయట. ఈ రెండూ తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించి ఎలాంటి సమస్య ఉండదట. తేనెకు ప్రీబయోటిక్ లక్షణాలు కూడా ఉండడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. పాలలో ఉండే ట్రిఫ్టోఫాన్ అమైనో ఆమ్లం నిద్రను ప్రేరేపిస్తుందట. నిద్రలోంచి బయటకు రావడానికి ఉపకరించే మెలటోనిన్ ను తేనె అదుపు చేస్తుంది. ఈ రెండూ కలిపి తాగడం వల్ల నిద్రకు ఎలాంటి ఆటంకం వుండదట. తేనె పాలు రెండింటినీ కలుపుకొని రోజుకు రెండు సార్లు ప్రతీ రోజు తాగడం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.