Beer Is Beneficial For Health : ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత బీర్ తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!!

ఏ కార్యమైనా సరే...మద్యం ఉండాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే తాగడానికి మాకు ప్రత్యేకమైన కారణం అవసరంలేదనే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అయితే మద్యం తాగడంలో చాలామంది బీర్ ను ఎంచుకుంటారు.

  • Written By:
  • Publish Date - July 10, 2022 / 07:45 AM IST

ఏ కార్యమైనా సరే…మద్యం ఉండాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే తాగడానికి మాకు ప్రత్యేకమైన కారణం అవసరంలేదనే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అయితే మద్యం తాగడంలో చాలామంది బీర్ ను ఎంచుకుంటారు. ఇది ఆల్కహాల్ ఉత్పత్తుల వలే ప్రమాదకరమైనది కాదు. అంతేకాదు బీర్ ఆరోగ్యానికి మంచిదని కొత్త అధ్యయనంలో తేలింది. ఈ మధ్యే వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం…బీర్ తాగితే కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని తేలింది. పోర్చుగల్ లోని నోవా యూనివర్సిటీ లిస్బన్ కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. రోజు రాత్రి భోజనంతోపాటు బీర్ తాగితే…పురుషుల పొట్టలో మంచి బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుందని వారు చెబుతున్నారు. అదేలాగో తెలుసుకుందాం.

నోవా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నాలుగు వారాలు పాటు ప్రతిరోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత కొంతమందికి బీర్ తాగించారు. ఈ పరిశోధనలో మొత్తం 19మంది పురుషులు పాల్గొన్నారు. వారి సగటు 35సంవత్సరాల లోపు ఉన్నవారే. వీరంతా కూడా నాలుగు వారాల పాటు రాత్రిభోజనంతో పాటు 325మిల్లీలీటర్ల బీర్ తాగారు. లాగర్ అంటే ఒక రకమైన బీర్. ఇందులో పాల్గొన్నవారిలో కొందరికి ఆల్కాహల్…మరికొంతమందికి ఆల్కాహాల్ లేని బీర్ ఇచ్చారు. ఆల్కాహాల్ లాగర్ లో ఆల్కాహాల్ కంటెంట్ 5.2శాతం ఉంది.ఇది ఎక్కువ ఆల్కాహాల్ ఉన్న వర్గంలో ఉంచారు. నాలుగు వారాల తర్వాత ఈ పరిశోధనలో పాల్గొన్నవారి మలం, రక్తం నమూనాలను తీసుకున్నారు.

రాత్రి భోజనం చేసిన తర్వాత బీర్ తాగినవారిలో రక్తం, గుండె, జీవక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని తేలింది. బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన ఈ పరిశోధనలు ఫలితాలు చెబుతున్నాయి. ఈ బ్యాక్టీరియా వైవిధ్యమైందని…ఇది మొత్తం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని పరిశోధకులు తేల్చారు. ప్రతిరోజూ బీర్ తాగడం వల్ల బరువు లేదా బాడీ మాస్ ఇండెక్స్ పెరగదని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. అంతేకాదు గుండె, జీవక్రియలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉండదని తేల్చారు.

బీర్ మంచి బ్యాక్టీరియాను ఎలా పెంచుతుంది.
బీర్ లో పాలీఫైనాల్స్ అనే సమ్మేళనాలు, కుళ్లిన ప్రక్రియ తర్వాత ఏర్పడిన సూక్ష్మీజీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. శరీరంలో అనేక రకాల బ్యాక్టీరియా ఉండటం చాలా ముఖ్యమని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.