Site icon HashtagU Telugu

Beer For Kidney Stones: బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Beer For Kidney Stones

Beer For Kidney Stones

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఈ కిడ్నీలో రాళ్ల కారణంగా నడుము నొప్పి వంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇది మూత్రపిండాల పని తీరుని కూడా ప్రభావితం చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ కారణంగా మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. అందుకే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వీరాంతవరకు ఎక్కువగా నీటిని తాగడం మంచిది. నీటి ఏంటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఫ్రూట్స్ ని కూడా తీసుకోవడం మంచిది.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీరు ఎక్కువగా తాగితే రాళ్లు కరిగిపోతాయని చాలామంది అంటుంటారు. ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కిడ్నీలో వాళ్లు ఉన్నవారు బీరు తాగితే రాళ్లు కరిగిపోతాయి అన్నది కేవలం ఒట్టి అపోహ మాత్రమే అని చెబుతున్నారు. ఎవరికైనా కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే అటువంటి వారు బీర్ తాగడం వల్ల మూత్రం వేగంగా ఒంట్లో ఉత్పత్తి అవుతుందట. ఫలితంగా కిడ్నీ వాపు వస్తుందట. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు. 5 నుంచి 10 శాతం మందికి మాత్రమే కిడ్నీలో రాళ్లకు ఖచ్చితమైన కారణం తెలుసు. కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో చాలా మందికి తెలియదు. సాధారణంగా తక్కువ నీరు త్రాగే వారు, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకునే వ్యక్తులలో ఇతరుల కంటే మూత్రపిండాల్లో రాళ్లు అభివృద్ధి చెందే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందట.

నీళ్లు చాలా తక్కువగా తాగే వారికి కిడ్నీలో రాళ్ల సమస్య మొదలవుతుందని చెబుతున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్ ఆహారాలు తీసుకున్నప్పుడు కిడ్నీలో కాల్షియం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది కిడ్నీ స్టోన్ సమస్యను కలిగిస్తుందట.అయితే కిడ్నీ స్టోన్ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా ద్రవ రూపంలో ఆహారం తీసుకోవాలని, ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు.