అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు ముఖంపై ముడతలు మచ్చలు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల కూడా ముఖంపై మొటిమలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం కొన్ని ఫేస్ ప్యాక్లను ట్రై చేయాలని చెబుతున్నారు. అయితే ముందుగా ఒక టేబుల్ స్పూన్ ని తీసుకొని అందులో తేనె ను వేసి మెత్తని పేస్టులా తయారు చేయాలి. మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల చర్మ మృదువుగా తయారవ్వడంతోపాటు ముడతలు తగ్గుతాయని చెబుతున్నారు.
అలాగే అశ్వగంధ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అశ్వగంధతో ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అశ్వగంధలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అందుకే ఇది ముడతలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల అశ్వగంధ పొడిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక గుడ్డులోని తెల్లసొనను వేసి బాగా మిక్స్ చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ముడతలు, నల్లటి మచ్చలు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
అదేవిధంగా కోడిగుడ్డు కూడా ఎందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కోడిగుడ్డు తెల్ల సొనలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పై ముడతలను తగ్గించి కాంతివంతంగా చేస్తుంది. అరటిపండు కూడా ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం బాగా పండిన అరటిపండులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. దీన్ని మెడకు, ముఖానికి అప్లై చేయండి. ఇది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి పోషణను, తేమను అందిస్తాయి. పైన చెప్పిన ఫేస్ ప్యాక్లను ట్రై చేస్తే తప్పకుండా ముఖంపై ముడతలు నల్లటి మచ్చలు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.