Site icon HashtagU Telugu

Beauty Tips: పండుగ వేళ మరింత అందంగా కనిపించాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే!

Beauty Tips

Beauty Tips

అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అరటి పండును తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనకు మార్కెట్లో తక్కువ ధరకే ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు మొదటి వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అరటిపండును చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ముఖ్యంగా అరటి పండుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తే మీ అందం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. మరి అరటి పండుతో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే… ముందుగా బాగా పండిన ఒక అరటిపండును తీసుకొని, రెండుగా కట్ చేసి అందులో సగం భాగాన్ని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ గంధాన్ని వేసి పేస్టులా చేసి తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించాలి. దీన్ని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై ఉన్న జిడ్డును తొలగిస్తుందని చెబుతున్నారు.

మరొక రెమిడీ విషయానికి వస్తే.. బాగా పండిన అరటి పండుని వెన్నమీ మిక్స్ చేసి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి మెడకు సమానంగా అప్లై చేయాలి. ఆ తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని, మెడను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే అరటి, వెన్నలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ లు ముఖంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి. అరటి పండుతో చేయాల్సిన మరొక రెమిడీ విషయానికి వస్తే.. పండిన అరటిపండు తీసుకుని పేస్ట్ లా చేసి, దీనిలో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై జిడ్డును నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

Exit mobile version