Site icon HashtagU Telugu

Beauty Tips: బాదం నూనె వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే!

Beauty Tips

Beauty Tips

బాదం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో రకాల సమస్యలను కూడా అరికడుతుంది. కేవలం బాదం వల్ల మాత్రమే కాకుండా బాదం నూనె వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. బాదం నూనె చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మం పొడిబారకుండా కాపాడుతుందట. అలాగే చర్మంలో పేరుకుపోయిన మృత కణాలని తొలగిస్తుందట. చర్మానికి మృదుత్వాన్ని అందించడంలో బాదం నూనె ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అలాగే దురద, మంట, ఎలర్జీ వంటి అన్ని చర్మ సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తుందట. బాదం నూనె యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంటుందట. ఇది చర్మ సౌందర్యాన్నిపెంచుకోవడం కోసం ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ళ కింద అప్లై చేసుకుని మృదువుగా మర్దన చేస్తే కళ్ళ కింద నల్లని వలయాలు తొలగిపోతాయట. అలాగే చర్మానికి బాదం నూనెని అప్లై చేసుకోవడం వలన చర్మంపై మృత కణాలు తొలగిపోతాయట.
అంతే కాకుండా చర్మానికి యవ్వన రూపాన్ని ఇవ్వటానికి సహాయపడుతుందట.

అలాగే చర్మం ముడతలు పడకుండా చర్మానికి సాగే గుణాన్ని బాదం నూనె అందిస్తుందని, ఆముదం, బాదం నూనెల మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే పెదవులు గులాబీ రంగులోకి మారుతాయని నిపుణులు చెబుతున్నారు. రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల నల్లగా ఉన్న ముఖం తెల్లగా మెరిసిపోవడం ఖాయం అని చెబుతున్నారు.