ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఒకవైపు వానలు దంచి కొడుతున్న కూడా వాతావరణం మాత్రం చల్లగా అవడం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఎండలు ఉన్నాయి. అయితే ఈ వేసేవి కాలంలో ఆహార పదార్థాలకు బదులుగా ఎక్కువగా పానీయాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఒకటి. ఈ జ్యూస్ బండ్లు రోడ్డు వైపున ఎక్కడ చూసినా కూడా విరివిగా ఉంటాయి. ఎక్కువ శాతం మంది ఇది జ్యూస్ ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ జ్యూస్ మరేదో కాదు బత్తాయి రసం. వీటినే కొన్ని ప్రదేశాలలో చీని కాయ అని కూడా అంటారు.
ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫైబర్ తోపాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవన్నీ కూడా శరీరానికి అవసరమైన మూలకాలు అని చెప్పాలి. ప్రతి రోజు బత్తాయి రసం తాగడం వల్ల ఈ పోషకాలు శరీరానికి బాగా అందుతాయట. వేడి వల్ల శరీరం బలహీనంగా మారినప్పుడు గ్లాస్ బత్తాయి రసం తాగితే తక్షణం శక్తి లభిస్తుందట. ఇది శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుందని, వేడి వల్ల వచ్చే నీరసం, తలనొప్పి వంటి లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుందని చెబుతున్నారు. ఈ జ్యూస్ తాగడం వల్ల లోపల ఉండే వేడి తగ్గిపోతుందట.
వేసవిలో అధికంగా కనిపించే హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ లభిస్తుందని, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే సహజ మార్గాల్లో ఇది కూడా ఒకటి అని చెబుతున్నారు. అలాగే విటమిన్ సి శరీరంలో రోగాలకు ప్రతి ఘటించే శక్తిని పెంపొందిస్తుందట. ఈ జ్యూస్ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందట. ప్రతిరోజూ కొద్దిపాటి బత్తాయి రసం తాగటం వల్ల మానసిక శక్తి కూడా ఉత్సాహంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ డ్రింక్ తాగడం వల్ల చర్మంపై సహజమైన కాంతి కనిపిస్తుందట. వేసవిలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటే బత్తాయి జ్యూస్ తాగడం ద్వారా చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుందట. అలాగే బత్తాయి రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందట. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయని, వేసవిలో తక్కువ ఆహారం తీసుకునే సమయంలో జీర్ణక్రియ సహజంగా జరిగేందుకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.