Coffee Tips: రోజూ తాగే కాఫీతో జాగ్రత్తగా ఉండండి.

కాఫీ చుక్క గొంతులో పడనిదే కొంతమందికి తెల్లారదు. మంచి సువాసన కలిగే కాఫీ తాగడం వల్ల పొద్దున్నే శరీరం కూడా రీఫ్రెష్ గా అనిపిస్తుంది.

కాఫీ (Coffee) చుక్క గొంతులో పడనిదే కొంతమందికి తెల్లారదు. మంచి సువాసన కలిగే కాఫీ తాగడం వల్ల పొద్దున్నే శరీరం కూడా రీఫ్రెష్ గా అనిపిస్తుంది. అందుకే టీ కంటే కాఫీకే ఎక్కువ మంది ప్రియులు ఉంటారు. కాఫీ తాగడం వల్ల మెదడుకి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాదు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధుల వంటి న్యూరోడెజెనరేటివ్ పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ మీరు కాఫీ (Coffee) ఎలా తాగుతున్నారు. బోలెడు పంచదార, చిక్కటి పాలు పోసుకుని ఎంచక్కా తాగేస్తున్నారా అయితే ఈ ప్రయోజనాలేవీ మీరు పొందకపోగా అనారోగ్యాల పాలవుతారు. కాఫీని సరైన పద్ధతిలో తాగినప్పుడే దాని తాలూకు ప్రయోజనాలు మీకు అందుతాయి. లేదంటే మెదడుని ప్రమాదంలోకి నెట్టేస్తుంది.

ఎక్కువ తాగొద్దు

కాఫీ (Coffee) లేదా కాపుచినో ఏదైనా మితంగా తాగినంత కాలం ఆరోగ్యానికి మంచిది. లేదంటే అతిగా తాగితే అనుకున్న దానికంటే ఎక్కువ హాని చేస్తుంది. న్యూట్రీషినల్ న్యూరోసైన్స్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకి ఆరు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల మెదడు వాల్యూమ్ దెబ్బతినడంతో పాటు 53 శాతం డీమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మీరు రోజులో ఎంత కాఫీ తాగితే ఆరోగ్యంగా ఉంటారో ముందు తెలుసుకోవాలి.

ఎంత తాగాలి?

యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఆరోగ్యంగా ఉన్న పెద్దలు సుమారు 400 మిల్లీ గ్రాముల కెఫీన్ తీసుకోవాలి. అంతే రోజుకి 4 కప్పులు చాలు. అంతకి మించి ఎక్కువగా తాగితే శరీరంలో కెఫీన్ అధికంగా చేరి నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది.

సూర్యాస్తమయం తర్వాత వద్దు..

లంచ్ చేసిన్ తర్వాత బద్ధకంగా నిద్ర మత్తుగా ఉంటుంది. దాని నుంచి బయట పడేందుకు కాఫీ సహాయపడుతుంది కానీ అది రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడేలా చేస్తుంది. నిద్రలో ఇబ్బందులు ఎదురవుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం దీని దీర్ఘకాలిక ప్రభావాలు మెదడు పనీతీరుకు అవసరమైన ప్రోటీన్ బీటా అమిలాయిడ్ పెంచుతాయి. అది ఎక్కువ అవడం వల్ల అల్జీమర్స్, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి సంభవిస్తాయి. అందుకే నిద్రపోవడానికి కనీసం ఆరు గంటల ముందు కాఫీ తాగొద్దని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

చక్కెర వద్దే వద్దు:

కాఫీని చక్కెర కుమ్ముకుని తాగారంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అభిజ్ఞా క్షీణత, అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలతో పోరాడవలసి వస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం అధికంగా చక్కెర వినియోగించడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. అందుకే మీరు చక్కెర చాలా కొంచెం వేసుకోవాలి. అసలు పంచదార లేకుండా కాఫీ తాగితే మరీ మంచిది.

హైడ్రేట్ గా ఉంచలేదు:

అతిగా కాఫీ తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. డీహైడ్రేషన్ వల్ల అలసట, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి హానికరమైన ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also Read:  Sania Mirza: మొదలు పెట్టిన చోటే ముగించి… సానియా భావోద్వేగం