Health: నులిపురుగులతో జర జాగ్రత్త, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 10:10 PM IST

Health: రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే కారణం అని డాక్టర్లు చెబుతున్నారు.  సంవత్సరం పిల్లవాడి నుండి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతూనే ఉంటారు. నులిపురుగులు, కొరడా పురుగులు, కొంకి పురుగులు, బద్దె పురుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు లాంటివి మన పొట్టలు చేరి అనేక రోగాలకు కారణం అవుతుంటాయి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖున దేశవ్యాప్తంగా నేషనల్ డి వార్మింగ్ డే (జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం) గా జరుపుకుంటారు.

రక్తహీనత, ఆకలి మందగించడం, శారీరకంగా బలహీనులు కావడం, కడుపునొప్పి, వికారముగా ఉండడం, వాంతులు, విరోచనాలు, మలములో రక్తం రావడం, మానసిక ఆందోళన వంటి అనేక రకాల సమస్యలకు నులి పురుగులు కారణమవుతాయి.  నులిపురుగుల గుడ్లు మలము ద్వారా బయటకు వచ్చి మట్టిని కలుషితం చేస్తాయని, ఈ గుడ్లు మట్టిలో లార్వాలుగా ఉంది చెందుతాయని లిల్లీ మేరి అన్నారు. పిల్లలు మట్టిలో ఆడుకోవటం, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వలన ఈ గుడ్లు లార్వాలు వారి లోపలికి చేరుకుంటాయని, పిల్లల్లో చేరిన లార్వాలు, గుడ్లు, క్రిములుగా వృద్ధి చెందుతాయని, ఎదిగిన నులిపురుగులు తిరిగి గుడ్లును ఉత్పత్తి చేసి పిల్లలకు అనారోగ్యం కలిగిస్తాయి.

ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడంతోపాటు వైద్యుల సూచనకు అనుగుణంగా ఆల్బెండజోల్ మాత్రలను క్రమం తప్పకుండా వెయ్యడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా నులిపురుగుల భారి నుండి పిల్లలను కాపాడవచ్చు. రక్తహీనత,,పోషకాహార లోపము వంటి సమస్యలు అధిగమించవచ్చు. పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. శారీరక, మానసిక పెరుగుదలతో పాటు వికాసం పెంపొందుతుంది. పనిచేయగలిగే సామర్థ్యం పెరుగుతుంది.