వేసవి కాలం వచ్చింది అంటే చాలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం విషయంలో కొంచెం ఏమారుపాటుగా ఉన్నా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో పోషకాలు విటమిన్లు ఖనిజ లవణాలు చాలా అవసరం. ఎండ వీడికి తట్టుకోవాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవని చెబుతున్నారు. మరి వేసవికాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. ముఖ్యంగా వేసవిలో ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే వేసవిగా మీ శరీరం నుంచి ఎక్కువగా నీళ్లు వృధా అవుతుంది. కావున మీరు తీసుకునే ఆహారంలో నీరు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. వేసవికాలంలో తీసుకోవాల్సిన వాటిలో పెరుగు చాలా ముఖ్యమైనది. గండం లేదంటే మజ్జిగ రూపంలో తీసుకోవడం వల్ల పేగులకు కావాల్సిన గట్ బ్యాక్టీరియా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను చక్కగా క్రమబద్ధీకరిస్తుందట. అంతేకాకుండా మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు. ముఖ్య పెరుగు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం విటమిన్ సి, ఏ, బి12 కూడా పుష్కలంగా లభిస్తాయి. అలాగే వేసవి కాలంలో పెరుగు వడదెబ్బ తగలకుండా కూడా కాపాడుతుందని, అందుకే పెరుగన్నం తింటే వేసవిలో ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.
అలాగే వేసవిలో సోయాబీన్స్ ను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి కావున మీ శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయట. సోయాబీన్స్ ను నానబెట్టి ఆ తర్వాత ఉడకబెట్టుకొని కూరల్లో కలుపుకొని తినడం ద్వారా చక్కటి పోషకాలు మీకు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎండాకాలంలో పప్పు దినుసులను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన శరీరం చెమట రూపంలో శరీరానికి కావలసిన లవణాలను మినరల్స్ ను ఎక్కువగా కోల్పోతుంది. కాబట్టి మీకు శక్తి కోసం ప్రోటీన్స్ అవసరం అవుతాయి. పప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కావున వేసవిలో పప్పు దినుసులతో చేసిన వంటకాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. వేసవిలో కీరా దోసకాయలతో చేసిన సలాడ్స్ తీసుకోవడం ద్వారా శరీరం కి మంచి పోషకాలు లభిస్తాయట. ముఖ్యంగా కీరా దోశలో ఉండే నీరు మీ శరీరానికి కావాల్సిన లవణాలను సరఫరా చేస్తుందట. అలాగే కీరా దోశలో అనేక ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి మన శరీరం చమట ద్వారా కోల్పోయిన నీటిని భర్తీ చేస్తాయి. కాబట్టి కీరా దోసకాయను వేసవిలో ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి చలవ చేస్తుందని చెబుతున్నారు.