Smoking: స్మోకింగ్ చేస్తే జుట్టు రాలిపోతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసి కూడా ఆ అలవాటును మార్చుకోరు. నిత్యం

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 07:30 AM IST

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసి కూడా ఆ అలవాటును మార్చుకోరు. నిత్యం పేపర్లలో సినిమా హాల్లో అలాగే టీవీలలో అందుకు సంబంధించిన ప్రకటనలు వేస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఈ ధూమపానం మధ్యపానం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలుత్తుతాయి అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా స్మోకింగ్ చేసే వారి సంఖ్య దేశంలో అంతకంతకు పెరుగుతూనే ఉంది. స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలిసినప్పటికీ వాటిని తాగడం మాత్రం మానుకోరు.

సిగరెట్ లలో ఉపయోగించే పొగాకు పొగలో 7,000 కంటే ఎక్కువ రసాయనాలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. ఈ రసాయనాలు 69 రకాల క్యాన్సర్లకు దారితీస్తాయని అధ్యయనాలు తేల్చి చెప్పేశాయి. అలాగే స్మోకింగ్ చేస్తే జుట్టు రాలిపోతుందా? అవును అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పొగాకు ను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బ తింటాయి. దాంతో జుట్టు విపరీతంగా రాలుతుంది. అయితే స్మోకింగ్ చేయని వారితో పోల్చితే స్మోకింగ్ చేసే మహిళలు, పురుషుల్లోనే జుట్టు రాలడం, బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సిగరెట్ లలో ఉండే నికోటిన్ లాంటి రసాయనాలు జుట్టు రాలడానికి దారితీస్తాయి. స్మోకింగ్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహాన్ని తగ్గించి జుట్టు రాలిపోయేలా చేస్తుంది. స్మోకింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగి డిఎన్ ఎకు నష్టం కలుగుతుంది. ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్ పెరిగితే ఆక్సీకరణ ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. సిగరెట్ తాగితే శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి బట్టతలకు దారితీస్తుంది.