Hair Fall : సిగరెట్ తాగుతున్నారా…బట్టతల వస్తుంది జాగ్రత్త..!!

ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అయినా తాగేవారు చాలా మంది ఉన్నారు. మనదేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 10:15 AM IST

ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అయినా తాగేవారు చాలా మంది ఉన్నారు. మనదేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తున్నాయి. 2018లో చేసిన ఓ పరిశోధన ప్రకారం..పొగాకు పొగలపో 7వేల కంటే ఎక్కువ రసాయనాలు ఉన్నాయని తేలింది. ఈ రసాయనాలు 69 రకాల క్యాన్సర్లకు దారి తీస్తాయని అధ్యయనాలు తేల్చాయి. పొగాను నుంచి వచ్చే రసాయనాలను పీల్చితే…మీ ఊపిరితిత్తుల నుంచి రక్తప్రవాహానికి అటు నుంచి ఇతర శరీర భాగాలకు చేరుతుంది. దీంతో మీ ఆరోగ్యంగా పూర్తిగా దెబ్బతింటుంది.

ధూమపానం జుట్టు రాలడానికి దారితీస్తుందా..?

జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది:
పొగను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. విపరీతంగా జుట్టు రాలిపోతుంది. 2020 అధ్యయనం ప్రకారం…పొగతాగనివారితో పోల్చితే పొగతాగే మహిళలు, పురుషుల్ల జుట్టు రాలడం, బట్టతల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. ధూమపానం చేసే ప్రతి ఐదువందల మందిలో 425మందికి జుట్టు రాలే సమస్య ఉందని పరిశోధకులు తేల్చేశారు.

సిగరెట్ లోని నికోటిన్ వంటి రసాయాలు ఉంటాయి. ఇవి జుట్టు రాలేందుకు దారితీస్తాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ధూమపానం ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. జుట్టు కుదుళ్లకు రక్తప్రవాహాన్ని తగ్గించేస్తుంది. దీంతో జుట్ట రాలిపోతుంది. ఇక ధూమపానం చేయడం వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగిపోతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరంలో DNAకు నష్టం కలుగుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్ పెరిగితే ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ధూమపానం చేస్తే శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు తేల్చారు. బట్టతలకు దారితీస్తుందని ఓ పరిశోధన వెల్లడించింది.

ధూమపానం చేయడం వల్ల నెత్తిపై రక్తప్రసరణ అనేది జరగదు. అంతేకాదు రక్తహీనతకు కూడా దారితీస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు విపరీతంగా రాలిపోతుంది. స్మోకింగ్ వ్యసనాన్ని మానడానికి లవంగం నూనె అనేది బాగా పనిచేస్తుంది.