Salt: మీరు ఉప్పు తక్కువగా తింటున్నారా..? అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే.. జాగ్రత్త

ఉప్పును తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మితిమీరి తినడం వల్ల అనేక

  • Written By:
  • Updated On - November 16, 2022 / 10:44 AM IST

ఉప్పును తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మితిమీరి తినడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా శరీరంలో సోడియం లోపం ఉన్నా కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు మనం తినే వంటలలో ఉప్పును వేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఉప్పును తినడం వల్ల కలిగే కష్టాలను తెలుసుకొని ఆహారాలలో ఉప్పు లేకుండా తినడం మొదలుపెట్టేసారు. అలా అని ఉప్పు తీసుకోవడం మొత్తంగా మానేస్తే సోడియం లోపంతో బాధపడాల్సి ఉంటుంది.

శరీరంలో సోడియం స్థాయిలు తగ్గితే ఇన్సులిన్ నిరోధకత పెరిగి దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరి ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలేత్తుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయోడిన్ మన శరీరానికి చాలా ముఖ్యమైన మూలకం. ఇది శరీరం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కి సహాయపడుతుంది. శరీరంలో అయోడిన్ లోపం హైపోథైరాయిడిజం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అధిక అయోడిన్ ప్రమాదకరమని గుర్తుంచుకోండి.

ఉసిరికాయ ను తీసుకోవడం థైరాయిడ్‌ లో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. విటమిన్ సి యొక్క ఉత్తమ వనరులలో ఉసిరి ఒకటి. ఉసిరి లోని పోషకాలు థైరాయిడ్‌ సమస్యను అదుపులో ఉంచుతాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ హైపో థైరాయిడిజం ప్రమాదాన్ని నివారించడానికి, ఆకు కూరలు తినడం మంచిది. బ్రోకలీ, మొలకలు, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, టర్నిప్‌లను తినడం హైపో థైరాయిడిజంలో సహాయపడుతుంది. సెలీనియం సార్డినెస్, గుడ్లు మొదలైన సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు హైపోథైరాయిడిజం సమస్యకు బాగా సహాయపడతాయి. సెలీనియం అనేది శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడే మూలకం.