Keto Diet : కీటో డైట్ ఫాలో అవుతున్నారా?…మీ గుండెకు తప్పదు ముప్పు..!!

అధిక బరువు, డయాబెటిస్, ఇతరాత్ర సమస్యలు నయం అవుతాయని కీటో డైట్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారా

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 08:00 PM IST

అధిక బరువు, డయాబెటిస్, ఇతరాత్ర సమస్యలు నయం అవుతాయని కీటో డైట్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారా..అయిత్ తస్మత్ జాగ్రత్త. కీటో డైట్ తో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. ఈ విషయాన్ని ఆరోగ్యనిపుణులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ఎక్కడచూసినా ప్రపంచవ్యాప్తంగా చాలామంది కీటో డైట్ ను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే డైట్ పై అధ్యయనాలు చేసిన నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కీటో డైట్ అంటే ..కార్బొహైడ్రెట్లు తక్కువగా తీసుకోవడం…కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. అయితే ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ డైట్ ను ఫాలో అవుతున్నారు. అయితే కీటో డైట్ వల్ల గుండె కు చాలా ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కార్బొహైడ్రెట్లు తగ్గించి తినడం సరికాదని చెబుతున్నారు.

ఇందులో భాగంగా కార్బొహైడ్రెట్లను తగ్గించి ఆహారం తీసుకుంటే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. కీటో డైట్ తో గుండె కొట్టుకునే లయ తప్పుతుందట. గుండె కొట్టుకునే రేటు అసాధారణంగా ఉంటుందట. దీంతో గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇతర గుండె సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. కీటో డైట్ ను తీసుకున్న వారిపై ఈ పరిశోధన చేస్తే ఈ విషయం తేలిందని వెల్లడించారు. కాబట్టి కీటో డైట్ ఫాలో అయ్యేవాళ్లు జాగ్రత్తలు పాటించడం మంచిది. లేదంటే అనవసరపు సమస్యలను తెచ్చుకునే అవకాశం ఉంటుంది.