Site icon HashtagU Telugu

Health Tips: వేడినీటితో ఎక్కువసేపు స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

Mixcollage 13 Dec 2023 01 56 Pm 8497

Mixcollage 13 Dec 2023 01 56 Pm 8497

మనలో చాలామంది గంటల తరబడి స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేయడం మంచిదే కానీ అలా ఎక్కువ సేపు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. మరి ముఖ్యంగా వేడి నీటితో ఎక్కువగా స్నానం చేయడం అసలు మంచిది కాదట. చాలామందికి పని చేసి వచ్చిన తర్వాత ఆ వేడి నీటితో స్నానం చేసి పడుకోవడం అలవాటు. అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కూడా స్నానం చేసి వెళ్తూ ఉంటారు. వేడి నీటితో స్నానం చేయడం శరీర ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అది శరీరంపై చర్మంపై ఎన్నో చెడు ప్రభావాలను చూపుతుంది.

స్నానానికి వాడే నీళ్లు ఎక్కువగా వేడిగా ఉంటే తల పైన రక్త ప్రసరణ వేగం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు కాబట్టి జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. మరి వేడి నీటితో ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన చర్మంలో నుండి సహజంగా ఆయిల్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చర్మ సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. మరీ వేడి నీళ్లతో స్నానం చేసిన బాత్ డబ్బులోని వేడి నీళ్లలో ఎక్కువసేపు కూర్చున్న దానిలోని వేడి వలన ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో చర్మం పొడి వారి ఎన్నో సమస్యలు వస్తుంటాయి.

ఇప్పటికే మొటిమల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అయితే వేడినీటి స్నానంతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని అమెరికా డాక్టర్లు తెలియజేస్తున్నారు. వేడినీళ్ల వల్ల ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో చర్మంలోని కణాలు నశిస్తాయని వీటితో మొటిమలు మరింత ఎక్కువ అవుతాయని తెలిపారు. చర్మానికి మేలు చేసే బ్యాక్టీరియా ఈ వేడినీళ్ల స్నానంతో చనిపోతుంది. వేడినీళ్ల స్నానం నరాలకు హాయిని కలిగించిన రక్తప్రసరణ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. రక్త ప్రసరణ వేగం పెంచి హైపర్ టెన్షన్ కి కారణం అవుతుంది. సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారి పోతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు నిరంతరం వేడి నీటితో స్నానం చేస్తే మీ చర్మం కూడా దెబ్బతింటుంది. కాబట్టి చర్మం మరింత పొడి వారితో ఉంటుంది దీనికి ఫలితంగా చర్మ ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.