మాములుగా మనకు సీజన్ లు చేంజ్ అయినప్పుడు రకరకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎంత శుభ్రంగా చర్మం ఫ్రెష్ గా అనిపించదు. మరి ముఖ్యంగా వేసవికాలంలో ప్రైవేట్ భాగాల్లో దుర్వాసన, చర్మంపై దద్దుర్లు, ర్యాష్ అన్నీ వచ్చేస్తాయి. చెమట కారణంగానే ఇవన్నీ వస్తూ ఉంటాయట. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలతో స్నానం చేస్తే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయట. అయితే అన్ని పాలతో స్నానం చేయలేం కాబట్టి స్నానం చేసే నీటిలో పాలు కలుపుకుంటే సరిపోతుంది అని చెబుతున్నారు.
పాలు చర్మపురంగును కూడా మెరుగుపరుస్తాయట. అయితే పాలు తో స్నానం చేయలేని వారు కొద్దిగా కాటన్ తీసుకుని పాలను చర్మంపై అప్లై చేసి పది నిమిషాల తర్వాత చర్మాన్ని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఇలాంటి చర్మ సమస్యలు రావు అంటున్నారు వైద్యులు. కాగా పాలలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. పాలు చర్మపు రంగును కూడా మెరుగుపరుస్తాయట. అలాగే స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును కలుపుకొని కూడా స్నానం చేయవచ్చు అని చెబుతున్నారు.
చాలా మంది స్త్రీలు స్నానానికి ముందు ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తూ ఉంటారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి వరం కంటే తక్కువ కాదు. మీరు స్నానానికి పసుపు నీటిని ఉపయోగించవచ్చట. గోరు వెచ్చగా ఉన్న నీటిలో 1 కప్పు పసుపు వేసి నీళ్లు బాగా కలపాలి. తర్వాత ఆ నీటితో స్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ నీటితో స్నానం చేయడం కూడా చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన తొలగిపోవడమే కాకుండా చర్మ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని కాపాడుతుందని చెబుతున్నారు.