Health Tips: అలాంటి పరిస్థితుల్లో స్నానం చేస్తున్నారా.. అయితే మానేస్తేనే మంచిది?

  • Written By:
  • Publish Date - March 2, 2024 / 11:00 AM IST

స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది రోజుకు రెండుసార్లు స్నానం చేస్తే మరకొంతమంది కేవలం ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. శరీరం శ్రమ, అలసట తొలగించడానికి ఉత్తమ మార్గం స్నానం చేయడం. వ్యక్తిగత పరిశుభ్రత కోసం స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది ప్రతిరోజూ మీకు తాజా అనుభూతిని కలిగిస్తుంది. ఈ కారణంగానే మన ఇంట్లో పెద్దలు పిల్లలకు రోజూ స్నానం చేయించాలని, వారి దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం చేయమని చెబుతారు. ఆయుర్వేదం ప్రకారం, మన శరీరం వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలతో రూపొందించబడింది.

స్నానం మీ శరీరంలోని ఈ మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. స్నానం చేయడం వల్ల మీ చర్మం మెరుపును కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది. స్నానం చేయడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ, ఆయుర్వేదంలో స్నానం చేయడం శరీరానికి అవసరమని భావించినప్పటికీ, మీరు స్నానం మానేయటానికి కూడా 4 కారణాలు ఉన్నాయి. అందులో మొదటి పరిస్థితి ఏమిటంటే, ఎవరికైనా అతిసారం ఉంటే వారు స్నానం చేయకుండా ఉండాలి. విరేచనాలు అయినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది.

అటువంటి పరిస్థితిలో అగ్ని తీవ్రత ఉన్న ఈ కాలంలో స్నానం చేయకూడదు. అలాగే చాలామంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మీరు ఆహారం తిన్నప్పుడు, దానిని జీర్ణం చేయడానికి శరీరంలో అగ్ని సిద్ధమవుతుంది. దీనిని జీర్ణ అగ్ని అని పిలుస్తారు. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు స్నానం చేసినప్పుడ, మీరు ఈ జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తారు. భోజనం చేసిన తర్వాత కనీసం 4 గంటల వరకు స్నానం చేయకూడదు. కడుపులో గ్యాస్ వచ్చినా, ఎసిడిటీ ఉన్నా మనం స్నానం చేయకూడదు. స్నానం చేసేటప్పుడు చెవుల్లోకి నీరు చేరడం వల్ల లేదా చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల కొన్నిసార్లు చెవి నొప్పి వస్తుంది. అటువంటి పరిస్థితిలో చెవి నొప్పి సమయంలో కూడా స్నానం చేయకూడదు.