Site icon HashtagU Telugu

Banana: అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారా తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Banana

Banana

అరటిపండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. వీటి ధర కూడా తక్కువే అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారని అందుకే ఎక్కువగా తినకూడదని చెబుతూ ఉంటారు. మరి నిజంగానే అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారా,లేదంటే బరువు తగ్గుతారా ఈ విషయం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణ అరటిపండులో 15 కేలరీలు, 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవే కాకుండా 3 గ్రాముల ఫైబర్, ఒక గ్రాము ప్రోటీన్ ఉంటుందట. విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు కూడా అరటిపండులో మెండుగా ఉంటాయట. అరటిపండు బరువు పెరగడానికి అలాగే తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అరరటిపండును ఎప్పుడు, ఎలా తీసుకుంటారనే దానిపై దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయట. అరటిపండును మితంగా తీసుకుంటే, దానిలోని ప్రోటీన్, ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడతాయట. దాని లోని పూర్తి పోషకాలను పొందవచ్చని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు.

అందులో అరటిపండు ఒకటి. దీన్ని తినడం వల్ల శరీరంలో కేలరీల స్థాయి పెరగదు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుందట. ఆకలిని కూడా అదుపులో ఉంచుతుందట. ముఖ్యంగా ఇందులో సహజంగా తీపి ఉండటం వల్ల తీపి తినాలనే కోరికను తగ్గిస్తుందని చెబుతున్నారు. కాబట్టి పోషకాలతో నిండిన అరటిపండును మితంగా తీసుకుంటే బరువు తగ్గవచ్చని, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా పొందవచ్చని చెబుతున్నారు. అరటిపండులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. కానీ దీన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అతిగా తీసుకున్నప్పుడు, శరీరంలో కార్బోహైడ్రేట్లు పేరుకుపోయి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయట. దీంతో బరువు పెరుగుతారట.