ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పైల్స్ సమస్య కూడా ఒకటి. ఆహారపు అలవాట్ల మార్పు కారణంగా ఎక్కువశాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనినే హెమోరాయిడ్స్ అని అంటారు. చాలామంది ఈ సమస్య గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా చాలామంది సిగ్గుతో వైద్యుని దగ్గరకు వెళ్లడానికి కూడా మొహమాటపడుతూ ఉంటారు. అయితే ఫైల్స్ సమస్య తరచుగా వేధిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. పైల్స్ ని తగ్గించడంలో అరటిపండు ఎంతో బాగా ఉపయోగ పడుతుంది.
అరటి పండులోని పోషకాలు, అధిక ఫైబర్ పైల్స్ సమస్యకు మంచి పరిష్కారాన్ని చూపిస్తాయి. అందుకే అరటి పండ్లను పైల్స్ ఫ్రెండ్లీ ఆహారంగా చూస్తారు. పైల్స్ తగ్గించుకోవడానికి, పైల్స్ రాకుండా ఉండటానికి అరటి పండ్లను ఎలా తినాలి, ఎప్పుడు తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ప్రేగు కదలికల సమయంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. పైల్స్ తీవ్రతరం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పైల్స్ రాకుండా అరటిపండ్లను తినాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా పూర్తిగా పండిన అరటి పండ్లనే ఎంచుకోవాలి. అరటిపండ్ల కంటే అరటికాయలను జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సులభంగా జీర్ణం కావడానికి, అందులోని పోషకాలు సక్రమంగా శరీరానికి అందడానికి పూర్తిగా పండిన అరటి పండ్లను తినాలి. తాజా అరటి పండ్లు తినడం చాలా ముఖ్యం. అలాగే అరటిపండ్లను ఇతర ఆహారాలతో కాకుండా నేరుగా తినడం వల్ల దాని ప్రయోజనాలు సక్రమంగా అందుతాయి. అలాగే తాజా పండ్లు తినడం మంచిది. తినేటప్పుడు పూర్తిగా నమలాలి.