మార్కెట్లో మనకు ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని రకాల సీజన్లలో మనకు ఈ అరటి పనులు లభిస్తూ ఉంటాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడితే ఉంటారు. కొందరు ఎప్పుడో ఒకసారి అరటి పండ్లు తింటే మరి కొందరు మాత్రం ప్రతిరోజు అరటిపండు తింటూనే ఉంటారు. మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాహారాన్ని తినాలి. అయితే ప్రతిరోజు అరటి పండ్లు తినేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. మరి ప్రతిరోజు అరటిపండు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటిపండ్లలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి 6, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కాబ్టటి వీటిని తింటే ఎక్కడ బరువు పెరిగిపోతామేమోనని భయపడాల్సిన అవసరం లేదు. కానీ అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు. అరటిపండ్లు జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లలో విటమిన్-సి, విటమిన్ బి 6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పొటాషియం జుట్టు, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది.
ఇది మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. ఇది జుట్టు తెగిపోవడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును అందంగా, సిల్కీగా ఉంచుతుంది. ప్రస్తుతం చాలా మంది డ్రై హెయిర్ సమస్యను ఫేస్ చేస్తున్నాయి. అయితే అరటిపండ్లు ఈ సమస్యను నివారించడానికి సహాయపడతాయి. అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందట. అరటిపండ్లు మిమ్మల్ని చురుకుగా, ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. అలాగే ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువును నియంత్రించడానికి అరటిపండ్లు సహాయపడతాయి. మీకు మూడ్ డిజార్డర్, యాంగ్జైటీ వంటి సమస్యలు ఉంటే వెంటనే అరటిపండ్లు తినండి. ఇవి మిమ్మల్ని ఈ సమస్యల నుంచి బయటపడేస్తాయి. అరటిపండ్లను తినడం వల్ల హ్యాపీగా, రిఫ్రెష్ గా అనిపిస్తుంది. అరటిపండ్లు గుండె ఆరోగ్యాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు..