అరటిపండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్ల వల్ల మాత్రమే కాకుండా అరటి ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆంధ్ర తెలంగాణలో కాకపోయినా కేరళ సైడు అరటి పువ్వుతో కొన్ని రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం అక్కడ అరటి పువ్వులను కూడా విక్రయిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అరటి పువ్వు వినియోగం పెరగడంతో అరటిపండును మార్కెట్ లలో విక్రయిస్తున్నారు. అరటి పువ్వులు తింటారు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు.
మరి అరటి పువ్వు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి పువ్వులో కాల్షియం, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయట. అరటి పువ్వును అండాశయ తిత్తులు ఉన్నవారు తినవచ్చట. వీళ్లకు ఈ పువ్వు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. ఉదయాన్నే అరటి పువ్వు రసం తాగితే గర్భాశయ సమస్యలు రావని చెబుతున్నారు. అరటి పువ్వులోని పీచు పదార్థాలను తొలగించి, పువ్వులను చిన్న చిన్న ముక్కలుగా కోసి మజ్జిగతో కలుపుకుని తాగాలట. టేస్ట్ కోసం మీరు కొద్దిగా ఉప్పును కూడా కలుపుకోవచ్చని చెబుతున్నారు. అరటి పువ్వు రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా బాగా సహాయపడుతుందట.
అరటిపువ్వు రక్తంలోని అవాంఛిత కొవ్వులను కరిగించి తొలగిస్తుందట. దీంతో శరీరంలో రక్తం మెరుగ్గా ప్రసరణ జరుగుతుందట. ఇది రక్త నాళాలకు అంటుకునే కొవ్వులను కరిగించి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుందట. అరటి పువ్వులు రక్తహీనత సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయట. అలాగే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయట. అరటి పువ్వు మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందట. ఈ పువ్వులో ఉండే ఫైబర్ వల్ల ఇదొక భేదిమందుగా కూడా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ పువ్వులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయట. అరటి పువ్వును ఆహారంలో ఎక్కువగా తీసుకునేవారికి తరచూ మూత్రం వచ్చే సమస్య కూడా తగ్గుతుందట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుందట.