Isabgol Benefits: ఈసబ్ గోల్ తో చెడు కొలెస్ట్రాల్ ఖతం

ఈసబ్ గోల్ దీన్నే Psyllium Husk అని అంటారు. ఇది ఒక జీర్ణక్రియ ఫైబర్..

ఈసబ్ గోల్ (Isabgol) దీన్నే Psyllium Husk అని అంటారు. ఇది ఒక జీర్ణక్రియ ఫైబర్.. ఆస్ప్ మరియు ఘోల్ అనే రెండు సంస్కృత పదాల నుంచి ఇది ఉద్భవించింది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ప్లాంటాగో ఓవాటా అనే మొక్క విత్తనాల నుంచి ఈసబ్ గోల్ (Isabgol) సేకరిస్తారు. జీర్ణ సమస్యలు, విరేచనాలకు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయడానికి ఇది ఉపయోగించ బడుతుంది.  ఆధునిక జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల చాలా మంది గుండె సిరల్లో చెడు కొలెస్ట్రాల్ (LDL) పేరుకు పోతోంది. దీంతో మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులు వస్తున్నాయి.

బరువు తగ్గడానికి ఈసబ్ గోల్ (Isabgol)

పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలనుకుంటే..రోజు తీసుకునే ఆహారంలో ఈసబ్ గోల్ వినియోగించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈసబ్ గోల్ (Isabgol) బరువును ఎలా తగ్గిస్తుంది?

ఈసబ్ గోల్‌లో క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే వీటిని తింటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. వీటిని రోజూ ఉదయం టిఫిన్ లో తింటే, బరువు వేగంగా తగ్గి, బొడ్డు చుట్టు కొవ్వు కూడా తగ్గుతుంది.

మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి

ఈసబ్ గోల్‌ లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది అసిడిటీ, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. పొట్టకు సంబంధించిన అవాంతరాలను కూడా చిటికెలో మాయం చేస్తుంది.

ఈసబ్ గోల్‌ (Isabgol) ఎలా ఉపయోగించాలి?

ఈసబ్ గోల్‌ ను నీరు లేదా పండ్లరసంతో కలిపి తాగవచ్చు. కొంతమంది దీని సిరప్ తయారు చేసి కూడా తాగుతారు. దీని కోసం..2 టీస్పూన్ల ఈసబ్ గోల్‌ నీటిలో కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగండి. బరువు తగ్గడానికి మీరు ఒక టేబుల్ స్పూన్ ఈ పొడిని ఒక గ్లాసు నీటితో త్రాగవచ్చు.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుందా?

ఈసబ్ గోల్ లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల గుణాలున్నాయని ఇటీవలే పరిశోధనల్లో రుజువైంది. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలున్న వారు ప్రతి రోజూ ఆహారంలో ఈసబ్ గోల్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈసబ్ గోల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కూడా కరిగిపోతుంది. అంతేకాకుండా బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ సులభంగా నియంత్రణలో ఉంటుంది. ఇది సుమారు 10 గ్రాములు తీసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయి ఐదు నుండి 10 పాయింట్లను తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది LDL “చెడు” కొలెస్ట్రాల్ యొక్క విచ్ఛిన్నం మరియు శోషణను ప్రోత్సహిస్తుంది. గుండె యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు మద్దతు ఇస్తుంది.

ఈసబ్ గోల్ (Isabgol) ను ఎలా తీసుకోవాలి?

కొలెస్ట్రాల్‌ ను నియంత్రించడానికి ఈసబ్ గోల్ ను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని తీసుకోవడానికి ముందుగా ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని..అందులో ఒక చెంచా ఈసబ్ గోల్ కలపాలి. ఇలా కలిపిన నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.

ఈసబ్ గోల్ (Isabgol) తీసుకునేటప్పుడు బీ అలర్ట్

కొంతమందికి ఈసబ్ గోల్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి, మలబద్ధకం, కడుపులో గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. వెంటనే డాక్టర్ ను సంప్రదించకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది

ఈసబ్ గోల్ తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. ఇది పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది. వీర్యం గట్టిపడేలా చేస్తుంది. మీ స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో రెండు-మూడు టేబుల్ స్పూన్ల ఈసబ్ గోల్ గింజలను తీసుకోవచ్చు.

Also Read:  Heart Attack: గుండె ఆరోగ్యాన్ని గుర్తించే ముఖ్యమైన టెస్టులు, స్కాన్స్ ఇవీ