Reduce Cholesterol: ఇది చదవకుంటే మాత్రలే గతి.. కొలస్ట్రాల్‌ తగ్గించే సహజ మార్గాలివీ!!

ఈ రోజుల్లో చాలామంది కొలస్ట్రాల్‌ బారిన పడుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారం తీసుకోవడం.రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

  • Written By:
  • Publish Date - August 20, 2022 / 06:30 PM IST

ఈ రోజుల్లో చాలామంది కొలస్ట్రాల్‌ బారిన పడుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారం తీసుకోవడం.రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది ఎన్నో రకాల ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. కానీ పెరిగిన  కొలెస్ట్రాల్ ఎలాంటి సంకేతాలను చూపించదు. దీనివల్లే ఎంతో మంది జీవితాలు ప్రమాదంలో పడిపోతున్నాయి. ఆరోగ్యకరమైన శరీరం కోసం కొలెస్ట్రాల్ ను సహజంగా తగ్గించుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ రెండు రకాలు..

మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్.. అంటే అధిక సాంద్రత కలిగిన లిపిప్రోటీనన్ (HDL). రెండోది తక్కువ సాంద్రత కలిగినన లిపోప్రోటీన్ అయిన చెడు కొలెస్ట్రాల్  (LDL).మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయా? లేక ఎక్కువగా ఉన్నాయా అనేది కేవలం రక్త పరీక్ష ద్వారానే గుర్తించగలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, మధుమేహం, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకే ఏ మాత్రం డౌట్ వచ్చినా వెంటనే డాక్టర్ వద్దకు వెల్లడం ఉత్తమం. మీ శరీరంలో కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే ముందుగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే గుండెకి చాలా ప్రమాదం. పెరిగిన కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలో చాలా మందికి తెలియదు.వ్యాయామంతో పాటు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.

కొవ్వు మాంసాలు వద్దు..

కొవ్వు మాంసాలను మానుకోండి.
మాంసం ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకి మంచి మూలమని చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల మాంసాలలో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వు ఉంటుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది.

తీపి పదార్థాలు తగ్గించండి

తీపి, చక్కెర పదార్థాలు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చక్కెర పదార్థాలకి బదులుగా పండ్లను తినండి.

ఫైబర్ పెంచండి..

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు
ఆహారంలో సంతృప్త కొవ్వును తగ్గించండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు ఎక్కువగా పెరిగితే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరిగినట్లవుతుంది.

ఓట్స్, బార్లీ, యాపిల్స్, బీన్స్, అవిసె గింజలు, చియా గింజలు..

మీ ఆహారంలో ఓట్స్, బార్లీ, యాపిల్స్, బీన్స్, అవిసె గింజలు, చియా గింజలను చేర్చుకుంటే మంచిది. తగినంత మొత్తంలో కరిగే ఫైబర్ తీసుకోండి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.

కూరగాయల వాడకం..

ఆహారంలో కూరగాయలని చేర్చుకోవాలి. బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి దుంపలు డైట్‌లో ఉండాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతాయి