Site icon HashtagU Telugu

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ లక్షణాలివే.. మరి తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకోండి

High Cholesterol Symptoms

How to find and how to reduce Bad Cholesterol in our Body

ఆధునిక జీవనశైలిలో చాలా మంది హోటల్ ఫుడ్(Hotel Food), ఫాస్ట్ ఫుడ్ లకు అలవాటుపడిపోయారు. ఫలితంగా అనూహ్యంగా శరీరాకృతిలో మార్పులు వస్తున్నాయి. ఊబకాయంతో(obesity) ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు చిన్న-పెద్ద, యువత- ముసలి అన్న తేడా లేదు. ఇదే చాలారకాల జబ్బులకు కూడా దారితీస్తుంది. లావుగా ఉన్నవారిలోనే కాదు, సన్నగా ఉన్నవారిలోనూ చెడు కొలెస్ట్రాల్(Bad Cholesterol) ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉందా లేదా అన్నది వైద్య పరీక్షల ద్వారా తెలుస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పేందుకు కొన్ని సంకేతాలున్నాయి.

ఛాతీలో తరచూ నొప్పిరావడం, ఛాతీలో అసౌకర్యంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెపోటు, ఎక్కువ దూరం నడవలేక కాళ్ల నొప్పులు రావడం, చేతులు తిమ్మిర్లు రావడం, పొత్తికడుపులో నొప్పి, మెడ- ఛాతీ భాగంలో లేదా చేయిలో సున్నితంగా ఉండటం లేదా గడ్డలు ఏర్పడటం వంటివి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడిందనేందుకు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. మరి చెడు కొలెస్ట్రాల్ ఏం చేయాలి ? ఇప్పుడు తెలుసుకుందాం.

1. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కనీసం వారానికి 5 రోజులపాటు రోజుకి 30 నిమిషాల చొప్పున వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి చేయడంతో శారీరకంగా శ్రమను పెంచాలి.

2. అలాగే.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పాటు లీన్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా ట్రాన్స్ కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర సంబంధిత ఆహారం, పానీయాలు, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, మసాలాలతో చేసిన వంటపదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

3. అధిక బరువు ఉన్నవారు వారానికి 1-2 కేజీలు తగ్గేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఈ డైట్ ను క్రమం తప్పకుండా పాటించాలి

4. మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. ఇది రక్తనాళాలను దెబ్బతీసి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సిగరెట్ మానడం వల్ల LDL (low-density lipoprotein) కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

5.అధికంగా ఆల్కహాల్ తీసుకునే వారికి కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మద్యపానం అలవాటున్న స్త్రీ, పురుషులు రోజుకు ఒక పెగ్ కంటే ఎక్కువ తాగడం అంత శ్రేయస్కరం కాదు. ఆల్కహాల్ ను తీసుకోవడం తగ్గించడంతో పాటు వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

6. అన్నం తినడం తగ్గించాలి. కొందరు రోజుకు రెండు లేదా మూడు పూటలా అన్నం తింటారు. శారీరక శ్రమ చేసేవారికి దానివల్ల ఇబ్బంది ఉండదు. కానీ.. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారు రోజుకి ఒక పూట రైస్.. రెండోపూట గోధుమ చపాతీ, లేదా పుల్కాలను ఎక్కువ ఆకుకూరలతో తినడం శ్రేయస్కరం. ఇలా తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు.

 

Also Read  :  Transport Business: బెస్ట్.. ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా : ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం