Site icon HashtagU Telugu

Eating Curd: ప్రతిరోజూ పెరుగు తింటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి?

Eating Curd

Eating Curd

పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. పెరుగు తినడం మంచిదే కానీ పెరుగు తినే సమయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. మరి పెరుగు తినేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా మిగతా కాలంలో కంటే సమ్మర్లో పెరుగుని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ సమ్మర్ లో పెరుగుకు బాగా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. వేసవిలో చాలా మంది భోజనంతో పాటు పెరుగు, చల్లని లస్సీ, మజ్జిగ తాగేందుకు ఇష్టపడతారు.

పెరుగులో ప్రోబయోటిక్స్ తో పాటు రిబోఫ్లావిన్, విటమిన్ ఏ, విటమిన్ బి-6, విటమిన్ బి-12 పాంతోతేనిక్ యాసిడ్ ఉంటాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అందుకే పెరుగును భారతదేశంలో అనేక విధాలుగా వినియోగిస్తారు. పెరుగన్నం,పెరుగుపచ్చడి,పెరుగు వడ, పెరుగు-పంచదార, పెరుగు రైతా ఇలా అనేక విధాలుగా తీసుకుంటూ ఉంటారు. కానీ పెరుగు తినడానికి సరైన విధానం, ఏ సమయంలో తినాలి అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు. . కాగా పెరుగు రుచిలో పుల్లగా ఉంటుంది. వేడిగా ఉంటుంది. జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

బరువు పెరగడానికి ఇది మంచిదే అయినప్పటికీ, ఇది శక్తిని మెరుగుపరచడంతో పాటు కఫా పిట్టాను పెంచుతుంది. అంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. లాక్టోస్ అసహనంతో కాల్షియం ఫాస్పరస్ అవసరాలను చూసుకునే వారికి పెరుగు మంచి ఎంపిక. ఇకపోతే పెరుగు ఎవరు తినకూడదు అన్న విషయానికి వస్తే… ఊబకాయం, కడుపు ఉబ్బరం, కఫా సమస్య, రక్తస్రావం సమస్యలతో బాధపడేవారు పెరుగు వినియోగానికి దూరంగా ఉండాలి. అలా అని పెరుగు ఎక్కువగా తినడం అంత మంచిది కాదు.

Exit mobile version