ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ లక్షణాలు స్వైన్ ఫ్లూ వ్యాధికి కూడా దారి తీస్తాయి. అయితే పలు ప్రాంతాలలో స్వైన్ ఫ్లూ కేసులు గుర్తించడంతో ప్రతి ఒక్కరు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ జాతి వల్ల వ్యాప్తి చెందుతుంది.
ఈ వ్యాధి సోకినప్పుడు తలనొప్పి, చలి, జ్వరం, ముక్కు కారడం, దగ్గు ,విరోచనాలు వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.ఇకపోతే ఈ వ్యాధి వ్యాధి చెందకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు మరి ఆ జాగ్రత్తలు ఏమిటి అనే విషయానికి వస్తే…
ఈ వ్యాధితో బాధపడేవారు లేదా ఇలాంటి లక్షణాలతో బాధపడేవారి నుంచి పూర్తిగా దూరంగా ఉండటం. దగ్గు లేదా తుమ్ము వచ్చిన సమయంలో ముక్కు మూతికి అడ్డు పెట్టుకోవడం లేదా టిష్యూని ఉపయోగించి వాటిని తర్వాత దూరంగా పడేయడం చేయాలి.
రద్దీగా ఉన్న ప్రదేశాలలో తిరగడం మానేయాలి అలాగే కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను దూరంగా పెట్టాలి. మన ఇంటిలోను ఇంటి పరిసర ప్రాంతాలలోనూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ధూపం వేయడం చేయాలి.
కొద్దిగా జీలకర్ర ధనియాలను బాగా మరిగించి ఆ నీటిని త్రాగటం వల్ల తొందరగా దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇకపోతే స్వైన్ ఫ్లూ నుంచి కోలుకోవడానికి మనం తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. దగ్గు ముక్కు కారడం నుంచి ఉపశమనం పొందడం కొరకు వీలైనంతవరకు ఆవిరి పట్టడం చేయాలి అలాగే వీలైనంతవరకు యోగ వంటి వాటిని చేయడం,పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులను రాకుండా జాగ్రత్త పడటమే కాకుండా వ్యాధిని నివారించవచ్చు.