Heel Pain: మడమ నొప్పితో సతమతమవుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

సాధారణంగా ఎక్కువసేపు నిల్చోని పనిచేసే వాళ్లు అలాగే అటు ఇటు తిరుగుతూ కష్టపడే వారు ఎక్కువగా మనము నొప్పి

Published By: HashtagU Telugu Desk
Heel Pain

Heel Pain

సాధారణంగా ఎక్కువసేపు నిల్చోని పనిచేసే వాళ్లు అలాగే అటు ఇటు తిరుగుతూ కష్టపడే వారు ఎక్కువగా మనము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ మడమ నొప్పి కారణంగా కూర్చోవడానికి నిలబడడానికి, పరిగెత్తడానికి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మడమ నొప్పితో ఏ పని చేయాలన్నా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మన శరీరంలో ఉండే అతిపెద్ద కీలు మడమ అన్న విషయం తెలిసిందే. మడమ నొప్పి ఎక్కువ అయితే తట్టుకోవడం చాలా కష్టం. మరి మడమ నొప్పి ఎందుకు వస్తుంది?

అటువంటి సమయంలో ఏం చేయాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన శరీర భారం అంతా కూడా మడమ పై పడుతుంది. అటువంటి మడమ సమస్య వస్తే కాలు కింద పెట్టి నడవాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాలు కింద మోపగానే నొప్పి సమస్యతో అల్లాడిపోతూ ఉంటారు. తెలియని విషయం ఏమిటంటే మన శరీరంలో ఉండే అతి పెద్ద కీలు మడమ నే. దాదాపుగా 33 ఎముకలతో కూడి ఉంటుంది. దాదాపుగా 100 కండరాలు చుట్టూ ఉంటాయి. ఈ పాదాలు సజావుగా ఉంటేనే ఆటాడగలం, నడవగలం, పరిగెత్తగలం, దూకగలం. ఈ కదలికలకు మూలం మడమ చుట్టూ ఉండే కండరాలే.

కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ మడమ నొప్పి సమస్య ఉంటే తగ్గించుకోవడం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎక్కువగా పని చేస్తే విటమిన్ బి12 లోపంతో మడమనొప్పి సమస్య వస్తుంది. నొప్పి ఉన్నప్పుడు బరువు తగ్గించుకోవడంతో పాటు మధుమేహం ఉంటే తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాలికి మెత్తని స్పాంజ్ లా ఉండొచ్చు చెప్పులు వేసుకొని నడవాలి. చెప్పులు లేకుండా అసలు నడవకూడదు. మజ్జిగ తాగితే నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి కాపడం పెట్టాలి. అలాగే నువ్వుల నూనె, కర్పూరం సమపాళ్లలో కలిపి పాదం కింది భాగంలో మసాజ్‌ చేయాలి. పులుపు, దుంప కూరలకు దూరంగా ఉండాలి. వేడి నీటిలో కాళ్లు పెట్టి అటూ ఇటూ తిప్పాలి. సాధారణ నొప్పి అయితే తగ్గిపోతుంది. ఎముక విరిగినట్లయితే సర్జరీకి వెళ్లాల్సిందే. వీటిని పాటించినప్పటికీ నొప్పి సమస్య అలాగే వేధిస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

  Last Updated: 11 Apr 2023, 03:45 PM IST