Benefits Of Neem Tree: వేప చెట్టులో ఔషద గుణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని లాభాలో!

వేప చెట్టు అన్న పేరు వినగానే మనకు అందులో ఉన్న ఔషదాలు గుర్తుకు వస్తుంటాయి. ఈ వేప చెట్టు లో ప్రతి భాగం

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 06:30 AM IST

Neem Tree: వేప చెట్టు అన్న పేరు వినగానే మనకు అందులో ఉన్న ఔషదాలు గుర్తుకు వస్తుంటాయి. ఈ వేప చెట్టు లో ప్రతి భాగం ఉపయోగ పడుతాయి అన్న విషయం తెలిసిందే. వేప చెట్టులోని ఆకులు, కాయలు, గింజలు, పూత, బెరడు, వేర్లు ఇలా వేప చెట్టు ప్రతి ఒక్క బాగం ఉపయోగ పడుతుంది. ఈ వేప చెట్టు లోని బాగాలను పూర్వం నుండే శాస్త్రవేతలు ఆయుర్వేదంలో ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే వేప కేవలం మనుషులకు మాత్రమే కాకుండా పంటలకి కూడా సహజ కీటకనాశినిగా పని చేస్తుంది. మరి వేప వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read:  Australia Pink Sky : ఆస్ట్రేలియా ఆకాశం హైజాక్.. ఏలియన్స్ “గులాబీ” వార్నింగ్!!

వేపలో ఉండే రసాయనాలు బ్లడ్ గ్లూకోజు, అల్సర్లను తగ్గిస్తాయని, బ్యాక్టీరియాను చంపేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ వ్యాధులకు కూడా వేప మంచి ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు. జీర్ణశక్తి మెరుగుపడడానికి, అలసట తగ్గించడానికి, దగ్గు, దాహాన్ని తగ్గించేందుకు, గాయాలు మానడానికి, అలాగే వాపు తగ్గించేందుకు కూడా వేప బాగా సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే శరీరంపై ఏవైనా గాయాలు ఉంటే వాటి పై వేప పౌడర్ ను నీటితో కానీ లేదంటే తేనెతో కలిపిగానీ పేస్ట్ లా తయారు చేసి గాయం పై రాయాలి. వేప పౌడర్ లేదా వేప ఆకులను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు వారానికి ఒక్కసారయినా తలకు వేప పౌడర్ ను పట్టించి స్నానం చేస్తే తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.

Also Read:  Feast: కోడిపుంజు పది రోజుల కర్మకు 500 మందికి భోజనాలు.. ఎక్కడో తెలుసా?

అదేవిధంగా వేప ఆకులతో డికాషన్ చేసుకుని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించి, బ్యాక్టీరియాను చంపేస్తుంది. అలాగే మొటిమల సమస్యలతో బాధపడేవారు వేప పౌడర్, చందనం, రోజ్ వాటర్ తో కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. వీటితో పాటుగా ప్రతి రోజూ 7 నుంచి 8 ఆకులను రెండు వారాలు నమిలి తినడంగానీ లేదా రోజూ ఒకటి రెండు నీమ్ టాబ్లెట్లను గానీ నెల రోజుల పాటు తీసుకోవచ్చు. లేదంటే రోజూ 10 నుంచి 15 ఎంఎల్ నీమ్ జ్యూస్ ను రెండు, మూడు వారాల పాటు తీసుకోవడం చేయాలి. ఇలా వేపను ఏ రూపంలో తీసుకున్నా శరీరంలోని హానికారక వ్యర్థాలు బయటకు పోతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వేపను గర్భిణీలు, శిశువులు, చిన్న పిల్లలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న స్త్రీ, పురుషులు వీటిని తీసుకోకూడదట.