మనలో చాలామంది ఒక్కోసారి పొట్టసంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఎసిడిటి,గ్యాస్ట్రిక్ ఒకరకం సమస్య అయితే..కడుపులో ఉండు నులిపురుగులు కూడా చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. వార్మ్ అనే ఈ సమస్య ఆహారం వల్ల ఇబ్బంది పెడుతుంది. స్వీట్లు ఎక్కువగా తినడం, మలబద్ధకం సమస్య, జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే కడుపులో నులిపురుగు సమస్య కనిపిస్తుంది. అయితే దీన్ని మొదట్లోనే గమనిస్తే ఆయుర్వేదం చిట్కాలతో నయం చేసుకోవచ్చు.
కడుపులో నులి పురుగుల లక్షణాలు
-అతిసారం
-తరచుగా ఆకలి దప్పులు
-మలంలో పురుగు కనిపించడం
-అలసట
-కడుపు నొప్పి
కడుపులో నులిపురుగుల సమస్య ఉన్నట్లయితే సరైన ఆహారం తినడం మంచిది. కూరగాయలు,పప్పులు బాగా ఉడికించి తినాలి. ఆకుకూరలు ఎక్కువగా తినడం మంచిది. పీచు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది.
కాకరకాయ
కాకరకాయలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పేగుల్లో ఉండే పురుగులను కూడా చంపడంలో బాగా పనిచేస్తుంది. కాకరకాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
అమృతావళి
అమృతావళి అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. పెద్దప్రేగు శోథ, ఆకలి లేకపోవటం, కడుపు నొప్పి, అధిక దాహం, వాంతుల నుండి బలమైన జీర్ణ వ్యవస్థ రోగనిరోధక వ్యవస్థను నిర్మించడానికి పనిచేస్తుంది.
అమృతావళి కడుపు సమస్యలకు దివ్యౌషధంగా సహాయపడుతుంది. కానీ ఎక్కువ వినియోగించడం మంచిది కాదని గుర్తుంచుకోండి.
పొట్లకాయ
పొట్లకాయ కడుపులో నులిపురుగుల సమస్యను దూరం చేస్తుంది. రోజూ అర గ్లాసు రసాన్ని తీసుకుంటే కడుపు సమస్యలు తగ్గుతాయి. అలాగే పొట్లకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.