Site icon HashtagU Telugu

‎Night Sleep: రాత్రిళ్లు సరిగా నిద్ర రావడం లేదా.. అయితే ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే?

Night Sleep

Night Sleep

‎‎Night Sleep: ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రులు సరిగా నిద్ర పట్టక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే రాత్రి సరిగా నిద్ర లేకపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. భోజనం చేయకపోవడం, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఇవి అన్ని ఒక ఎత్తు అయితే రాత్రిలో మనం తినే ఫుడ్ మరొక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే రాత్రిళ్ళు మనం తీసుకునే ఫుడ్ మన నిద్రకు ఆటంకం కలిగించవచ్చట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా ఉంటే రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవచ్చు అని చెబుతున్నారు.

‎మరి రాత్రి సమయంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నారింజ ఆరోగ్యకరమైనది. కానీ వాటిలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో ఇవి తింటే ఇవి కడుపులో మంట, ఆమ్లతను పెంచుతాయని, అందుకే వీటిని రాత్రి సమయంలో తీసుకోకూడదని చెబుతున్నారు. అలాగే టమోటాలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ వాటిలో ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి సమయంలో టమోటాలు తింటే కడుపులో మంట గుండెల్లో మంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. బ్రోకలీ, కాలిఫ్లవర్ ఆరోగ్యానికి మంచివే,కానీ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయట. రాత్రిపూట తింటే కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలు రావచ్చని చెబుతున్నారు.

‎అదేవిధంగా డార్క్ చాక్లెట్​లో కెఫీన్ ఉంటుంది. ఇది మెదడును మేల్కొల్పుతుందట. దీనిని రాత్రి సమయంలో తింటే నిద్ర రావడానికి ఇబ్బంది కలగవచ్చని చెబుతున్నారు. బాదం, జీడిపప్పు వంటి గింజలు ఆరోగ్యకరమైనవి. కానీ వాటిలో కొవ్వు అధికంగా ఉంటుంది.కానీ వీటిని రాత్రిపూట తింటే ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుందట. అప్పుడు కడుపు భారంగా అనిపిస్తుందని చెబుతున్నారు. పెరుగు ఆరోగ్యకరమైనది. కానీ రాత్రి సమయంలో తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ ఏర్పడవచ్చట. ముఖ్యంగా సెన్సిటివ్ సమస్యలను కలిగిస్తుందట. ఎక్కువ మసాలా కలిగిన ఆహారం కడుపులో మంటను పెంచుతుందట. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుందని, నిద్ర సరిగ్గా రాదని చెబుతున్నారు.

Exit mobile version