పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఒక్కోరికి ఒక్కోవిధమైన సమస్యలు వస్తాయి. కొందరికి విపరీతమైన కడపునొప్పి ఉంటే…మరికొందరికి నడుము నొప్పి ఉంటుంది. తలనొప్పి, లూజ్ మోషన్, మొటిమలు ఇలా ఎన్నో రకాలు సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు 9గంటలు ఆఫీసులో కూర్చోడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
1. పీరియడ్స్ లో శారీరక సంబంధం పెట్టుకోవద్దు:
పీరియడ్స్ సమయంలో శారీరకంగా కలుస్తే ప్రెగ్నేన్సీ రాదు. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ ఎలాంటి రక్షణ లేకుండా పీరియడ్స్ సమయంలో శారీరకంగా కలిసినట్లయితే…లైంగింక సంక్రమించే వ్యాధి మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో రక్షణ చాలా అవసరం.
2. ఉబ్బరం కలిగించే ఆహారాలకు దూరంగా:
పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కడుపు మరింత ఉబ్బరంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. కాఫీ,కార్బొనేటేడ్ డ్రింక్స్, సోడియం ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్ , కారం,ఉప్పు వీటన్నింటికి దూరంగా ఉండాలి.
3. గొడవలకు దూరంగా…:
కోపం, దు:ఖం ఇవన్నీ కూడా మనలోని హార్మోన్ల వల్లే జరుగుతాయి. ఈ సమయంలో కొంతమంది చాలా కోపంగా ఉంటారు. అందుకే ఈ సమయంలో గొడవలకు దూరంగా ఉండేలా ప్రయత్నించండి.
4. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకండి:
పీరియడ్స్ సమయంలో ముఖం మీద మొటిమలు ఎక్కువగా వస్తాయి. మనం అందంగా లేనట్లుగా అనిపిస్తుంది. ఉబ్బరంగా ఉండటంతో చాలా లావుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవితంలో అన్ని కోల్పోయినట్లు శూన్యత ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా కేవలం రెండు-మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అందుకే మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
5. హైడ్రేటెడ్ గా ఉండడం మర్చిపోవద్దు:
పీరియడ్స్ సమయంలో పూర్తిగా హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. లెమన్ జ్యూస్ , దోసకాయ, కొబ్బరి నీరు, రసం ఎక్కువగా తాగాలి.