Site icon HashtagU Telugu

Vegetables: రాత్రి సమయంలో పొరపాటున కూడా ఈ కూరగాయలను అస్సలు తినకండి?

Vegetables

Vegetables

ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు,పండ్లు, కాయగూరలు, పప్పు ధాన్యాలు వంటివి బాగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు వైద్యులు. ముఖ్యంగా కాయగూరలను బాగా తీసుకోవాలని తరచుగా ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే కాయగూరలు తినడం మంచిదే కానీ కొన్ని రకాల కాయగూరలు రాత్రి పూట అసలు తినకూడదట. మరి ఎటువంటి కూరగాయలు రాత్రిపూట తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రిపూట బాగా నిద్ర పట్టాలి అంటే వెల్లుల్లిని తినకూడదని చెబుతున్నారు. వెల్లుల్లి తినడం వల్ల పొట్టలో గ్యాస్ రావడంతో పాటు ఉబ్బరం అంటే సమస్యలు కూడా వస్తాయట. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు రాత్రిపూట వెల్లుల్లి తినకపోవడమే మంచిది. బ్రోకలీలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రాత్రి భోజనంలో తీసుకుంటే జీర్ణం కావడం కష్టం అవుతుంది. ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదని చాలామంది రాత్రిపూట కూడా ఎక్కువగా తింటూ ఉంటారు.

కానీ ఆరోగ్యానికి మంచిదే కదా అని రాత్రిపూట ఎక్కువగా తీసుకుంటే మాత్రం నిద్రలేమికి కారణం అవుతుందట. అది కాకుండా కడుపులో యాసిడ్ సమస్య కూడా వస్తుందట. అలాగే టమోటాలను కూడా రాత్రిపూట ఎక్కువగా తీసుకోకూడదు. టొమాటో ఎక్కువగా తీసుకుంటే పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయట. టమోటాలో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇవి మెదడు కార్యకలాపాలని పెంచుతాయి. దాంతో నిద్ర పట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుందట. అదేవిధంగా రాత్రి పూట తినకూడని కూరగాయలలో చిలగడదుంప కూడా ఒకటి. ఇందులో కార్బోహైడ్రేట్లు , పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version