Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత పొరపాటున కూడా వాటిని తిన్నారంటే అంతే సంగతులు?

వేసవికాలంలో మనకు దొరికేపండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 09:30 PM IST

వేసవికాలంలో మనకు దొరికేపండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా సమ్మర్ పుచ్చకాయను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో 95% నీరు ఉంటుంది. పుచ్చకాయలోని పోషకాలు వేసవిలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి. పుచ్చకాయ తినడం మంచిదే కానీ పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు అంటున్నారు నిపుణులు.

మరి పుచ్చకాయ తిన్న తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయ తిన్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పాలు తాగకూడదు. ఎందుకంటె పుచ్చకాయ తిన్నాక పాలు తాగితో ఆరోగ్య సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అనంతరం పాలు తాగడం వల్ల ప్రతి చర్య జరుగుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మాములుగా ప్రోటీన్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కానీ పుచ్చకాయ తిన్న తర్వాత ఎప్పుడు కూడా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. పుచ్చకాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అదనంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధిక ప్రోటీన్లు జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి. అదేవిదంగా పుచ్చకాయ తిన్న తర్వాత కోడి గుడ్లు తినవద్దు. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. గుడ్లలో ప్రోటీన్లు మాత్రమే కాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిచర్య వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.